Breaking News

సోదరితో పాటు షాపింగ్‌ చేసిన షేక్‌ హసీనా

Published on Thu, 08/08/2024 - 10:34

బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు తర్వాత మాజీ ప్రధాని షేక్ హసీనా బృందంలోని సభ్యులంతా హడావుడిగా భారత్‌కు తరలివచ్చారు. మీడియాకు అందిన సమాచారం ‍ప్రకారం షేక్‌ హసీనా టీమ్‌లోని చాలా మంది ఇక్కడికి వచ్చే సమయంలో తమ దుస్తులతో పాటు ఇతర రోజువారీ వినియోగ వస్తువులను కూడా తీసుకురాలేదు.

భారత ప్రోటోకాల్ అధికారులు హసీనా జట్టు సభ్యులకు దుస్తులు ఇతర వస్తువులను కొనుగోలు చేసుకునేందుకు సహాయం అందించారు. బంగ్లాదేశ్‌లో వారు ఎదుర్కొన్న భయానక అనుభవాల నుంచి వారు ఇంకా కోలుకోలేదని అధికార వర్గాలు తెలిపాయి. బంగ్లాదేశ్ సైన్యం షేక్ హసీనాకు రాజీనామా చేసేందుకు 45 నిమిషాల సమయం మాత్రమే ఇచ్చింది. దీంతో ఆమె వెంటనే తన రాజీనామాను అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్‌కు సమర్పించారు. అనంతరం ఆమె భారత్‌ తరలివచ్చారు.

తాజాగా షేక్ హసీనా తన సోదరి రిహన్నాతో కలిసి ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్ బేస్ షాపింగ్ కాంప్లె  క్స్‌కు వచ్చి తనకు అవసరమైన దుస్తులు ఇతర నిత్యావసర వస్తువులు కొనుగోలు చేశారు. ఆమె సుమారు రూ.30 వేల విలువైన సామగ్రి కొనుగోలు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ మొత్తాన్ని ఆమె భారతీయ రూపాయిలలో చెల్లించారు. అయితే ఈ కొనుగోలు అధికారికంగా ధృవీకృతం కాలేదు. ప్రస్తుతం షేక్‌ హసీనా.. హిండన్ ఎయిర్‌బేస్‌లోని సేఫ్ హౌస్‌లో ఉంటున్నారు. ఆమె త్వరలో ఇక్కడ నుండి మరొక ప్రదేశానికి తరలివెళ్లవచ్చని తెలుస్తోంది.

షేక్ హసీనా భద్రత కోసం  ఆమె ఉంటున్న ప్రాంతంలో కమాండోలను మోహరించారు. షేక్ హసీనా తన సోదరి రెహానాతో కలిసి  బంగ్లాదేశ్ నుంచి హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్ హిండన్ ఎయిర్‌బేస్‌లో ఆమెను కలుసుకున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)