Breaking News

రాహుల్‌కు జై కొట్టిన శశిథరూర్‌..!

Published on Fri, 08/08/2025 - 18:14

న్యూఢిల్లీ:  తరుచు కాంగ్రెస్‌ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కేంద్రానికి అండగా నిలుస్తూ వస్తున్న  ఆ పార్టీ ఎంపీ శశిథరూర్‌.. ఎట్టకేలకు రాహుల్‌ గాంధీకి జై కొట్టారు. ఆపరేషన్‌ సింధూర్‌ అంశం దగ్గర్నుంచి కాంగ్రెస్‌ ఒకటి చెబితే, శశిథరూర్‌ వ్యాఖ్య మరొకటిగా ఉండేది. ఈ క్రమంలోనే ఆపరేషన్‌ సింధూర్‌ అంశానికి సంబంధించి పార్లమెంట్‌లో జరిగిన చర్చలో సీనియర్‌ కాంగ్రెస్‌ ఎంపీగా ఉన్న శశిథరూర్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు విపక్ష కాంగ్రెస్‌. 

అదే సమయంలో కేంద్రానికి పదే పదే వత్తాసు పలుకుతున్న శిథరూర్‌ వరుస స్టేట్‌మెంట్లతో కాంగ్రెస్‌ను ఇరకాటంలోకి నెట్టేశారు కూడా. అయితే తాజాగా విపక్ష నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలకు అండగా నిలిచారు శశిథరూర్‌. రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని బీజేపీ చెబుతున క్రమంలో శశిథరూర్‌ మాత్రం రాహల్‌కే జై కొట్టడం కాస్త ఆసక్తిని పెంచింది. 

ఓటర్‌ జాబితా అవకతవకలతోనే బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిందని, ఎన్నికల సంఘం రాజ్యాంగానికి గనుక కట్టుబడి ఉంటే తాము కోరిన వివరాలను అందించాలని విపక్ష నేత రాహుల్‌ గాంధీ అన్నారు. శుక్రవారం(ఆగస్టు 8వ తేదీ) బెంగళూరులో ఓట్‌ అధికార్‌ ర్యాలీ పేరిట నిర్వహించిన ధర్నాలో  ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్‌. 

దీనికి కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ నుంచి మాత్రం​ ఫుల్‌ సపోర్ట్‌ లభించింది.   ఈ అంశాన్ని ప్రతీ రాజకీయ పార్టీ తీవ్రమైన అంశంగా పరిగణించాలి.  మన ప్రజాస్వామ్యం చాలా విలువైనది,. ఓటర్ల ప్రయోజనాల దృష్ట్యా తీవ్రంగా పరిగణించల్సిన అంశం. అసమర్థత కావొచ్చు.. అజాగ్రత్త కావొచ్చు..  ఉద్దేశ పూర్వకంగా తారుమారు చేసే ప్రక్రియ కావొచ్చు. ఇది మన విశ్వసనీయతను నాశనం చేసే ఒక ప్రక్రియ. దీనిపై ఈసీ సమాధానం చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు శశిథరూర్‌. ఈ మేరకు రాహుల్‌  స్పీచ్‌ను సైతం పో స్ట్‌ చేశారు.

These are serious questions which must be seriously addressed in the interests of all parties & all voters. Our democracy is too precious to allow its credibility to be destroyed by incompetence, carelessness or worse, deliberate tampering. @ECISVEEP must urgently act &… https://t.co/RvKd4mSkae

 కింది లింక్‌లో రాహుల్‌ వ్యాఖ్యలు చదివేయండి..

 ‘ఓట్ల దొంగతనానికి ఆధారాలు ఇదిగో’

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి