Breaking News

కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌ 

Published on Sun, 05/18/2025 - 05:38

న్యూఢిల్లీ:  పాకిస్తాన్‌పై భారత్‌ ప్రారంభించిన దౌత్య యుద్ధం కాంగ్రెస్‌ పార్టీలో చిచ్చురేపింది. ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న పాకిస్తాన్‌ తీరును ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సహా ప్రపంచ దేశాల్లో ఎండగట్టడానికి, ఉగ్రవాదంపై భారత్‌ వైఖరిని వివరించడానికి కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష నేతలతో ఏడు బృందాలు ఏర్పాటు చేసింది. కాంగ్రెస్‌ ప్రతిపాదించిన నాలుగు పేర్లను పక్కనపెట్టి, ఆ పార్టీ ఎంపీ శశి థరూర్‌ను ఎంపిక చేయడం సంచలనాత్మకంగా మారింది. అంతేకాకుండా ఓ బృందానికి శశి థరూర్‌ నేతృత్వం వహిస్తారని ప్రకటించడం గమనార్హం. కాంగ్రెస్‌కు, థరూర్‌కు మధ్య ఇటీవల దూరం పెరుగుతున్న సంగతి తెలిసిందే. 

బీజేపీ పట్ల ఆయన సానుకూలంగా మాట్లాడుతుండడం కాంగ్రెస్‌ జీర్ణించుకోలేకపోతోంది. ఏడు బృందాలకు సారథ్యం వహించే నేతల పేర్లను కేంద్రం ప్రకటించిన తర్వాత కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి, మీడియా ఇన్‌చార్జి జైరామ్‌ రమేశ్‌ స్పందించారు. తాము ప్రతిపాదించని వ్యక్తిని ఎంపిక చేయడం ఏమిటని ప్రశ్నించారు. ‘‘పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు మా పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు రాహుల్‌ గాందీతో మాట్లాడారు. విదేశాలకు పంపించే ప్రతినిధి బృందాల్లో నియమించడానికి నలుగురు ఎంపీల పేర్లను ప్రతిపాదించాలని కోరారు. దాంతో రాహుల్‌ గాంధీ మా పార్టీ నుంచి ఆనంద్‌ శర్మ, గౌరవ్‌ గొగోయ్, సయ్యద్‌ నజీర్‌ హుస్సేన్, అమరీందర్‌సింగ్‌ రాజా వారింగ్‌ పేర్లను ప్రతిపాదిస్తూ కిరణ్‌ రిజిజుకు లేఖ రాశారు’’అని జైరామ్‌ రమేశ్‌ చెప్పారు.  

ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్‌కు దూరం!  
శశి థరూర్‌ వైఖరి కొన్ని నెలలుగా కాంగ్రెస్‌ పారీ్టలో చర్చనీయాంశంగా మారుతోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి అనుకూలంగా ఆయన తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తు న్నారు. పాకిస్తాన్‌తో కాల్పుల విరమణ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జోక్య చేసుకోవడం పట్ల బీజేపీని విపక్షాలన్నీ తప్పుపట్టగా, శశి థరూర్‌ మాత్రం వెనుకేసుకొ చ్చారు. ఆయన లక్ష్మణ రేఖ దాటారని కాంగ్రెస్‌ నాయకు లు మండిపడ్డారు. కానీ, ఒక భారతీయుడిగా తన సొంత అభిప్రాయాలు వెల్లడించానని, తన వ్యాఖ్యలతో కాంగ్రెస్‌కు సంబంధం లేదని థరూ ర్‌ వివరణ ఇచ్చారు. కొన్ని రోజుల క్రితం కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ తో శశి థరూర్‌ వేదిక పంచుకున్నారు. తమను ఒకే వేదికపై చూసి కొందరికి నిద్ర పట్టదని కూడా ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.    

గొప్ప గౌరవంగా భావిస్తున్నా: థరూర్‌  
అఖిలపక్ష బృందానికి నాయకత్వం వహించే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం తనకు కల్పించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ చెప్పారు. ‘‘నా సేవలు అవసరమని కేంద్రం భావిస్తే అందుకు సిద్ధంగా ఉన్నా. దేశ ప్రయోజనాల పరిరక్షణ కోసం నా వంతు సేవలు కచ్చితంగా అందిస్తా.. జైహింద్‌’’అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.  
 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య