Breaking News

‘శారద’లో మరో విద్యార్థి బలవన్మరణం.. ‘లేఖ’లో విద్యా విధానంపై ఆగ్రహం

Published on Sun, 08/17/2025 - 09:50

న్యూఢిల్లీ: చదువుల ఒత్తిడిని తట్టుకోలేక మరో విద్యా  కుసుమం నేల రాలింది. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలోని శారదా విశ్వవిద్యాలయంలో చోటుచేసుకుంది. వర్శిటీకి చెందిన బిటెక్ విద్యార్థి శివమ్‌ డే(24) తన హాస్టల్ గదిలో ఉరివేసుకున్నాడు.  ఈ ఘటన దరిమిలా విశ్వవిద్యాలయంలో విషాదఛాయలు అలముకున్నాయి.

బీహార్‌లోని మధుబనికి చెందిన శివమ్‌.. వర్శిటీలోని హెచ్‌ఎంఆర్ హాస్టల్‌లో  ఉంటున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఫోరెన్సిక్ బృందం శివమ్‌ గదిని పరిశీలించింది. అక్కడ శివమ్‌ రాసిన లేఖ పోలీసులకు దొరికింది. దానిలో శివమ్‌ ‘మీరు దీనిని చదివే సమయానికి నేను చనిపోయివుంటాను. నా మరణం నా సొంత నిర్ణయం. ఇందులో ఎవరికీ సంబంధం లేదు. నేను ఒక  ఏడాదిగా ఇందుకోసం ప్లాన్ చేస్తున్నాను. రెండేళ్లుగా తరగతులకు హాజరు కావడం లేదు. నా  ఫీజులను నా కుటుంబానికి తిరిగి చెల్లించండి. భారతదేశ విద్యా వ్యవస్థ నిరాశాజనకంగా ఉంది. దీనిని పరిష్కరించకపోతే, దేశం పురోగతి సాధించలేదు. నా అవయవాలను అవసరమైనవారికి దానం చేయండి’ అని శివమ్‌ ఆ లేఖలో రాశాడు.

కుమారుని ఆత్మహత్య గురించి తెలుసుకున్న శివమ్‌ కుటుంబసభ్యులు.. తమ కుమారుడు రెండేళ్లుగా తరగతులకు హాజరు కాకుంటే, ఆ విషయాన్ని తమకు ఎందుకు చెప్పలేదని కాలేజీ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. కాగా శారదా యూనివర్సిటీలో గత నెలలో రెండవ ఏడాది దంత విద్యార్థిని హాస్టల్‌లో బలవన్మరణానికి పాల్పడింది. ఫ్యాకల్టీ వేధింపులపై ఆరోపణలు చేస్తూ ఆమె ఒక లేఖ  రాసింది. ఈ ఘటన క్యాంపస్‌లో నిరసనలకు దారితీసింది. ఈ కేసు నేపధ్యంలో ఇద్దరు సిబ్బందిని పోలీసులు అరెస్టు చేశారు. శివమ్‌ ఆత్మహత్యపై దర్యాప్తు కొనసాగుతున్నదని పోలీసులు తెలిపారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)