Breaking News

బీజేపీపై వ్యతిరేకత వస్తోందన్నారు..కానీ గడ్కరీపై ప్రశంసలు: శరద్‌ పవార్‌

Published on Wed, 06/07/2023 - 17:42

నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ) చీఫ్‌ శరద్‌ పవార్‌ బీజేపీపై వ్యతిరేకత వస్తోందన్నారు. ఈ మేరకు ఆయన జౌరంగబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ..కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిగణనలోకి తీసుకుంటూ..ప్రజల్లో మార్పు వస్తుందన్నారు. మహారాష్ట్రలో చిన్న చిన్న సంఘటనలకు మత రంగు పులిముతున్నారని, ఇది మంచి సంకేతం కాదని అన్నారు. ఐదేళ్ల విరామం తర్వాత మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఓటమిని చవిచూసిందన్నారు.

ఈ దృష్టాంతాన్ని చూస్తుంటే బీజేపీపై వ్యతిరేకత ప్రారంభమైందని భావిస్తున్నానని చెప్పారు. ప్రజలు మనస్తత్వం ఇలానే కొనసాగితే దేశంలో జరగబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అని జ్యోతిష్కుడిని సంప్రదించాల్సిన పనిలేదన్నారు. లోక్‌సభ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగే అవకాశం గురించి అడిగిన ప్రశ్నకు..ఎన్సీపీ చీఫ్‌ తన పార్టీ మిత్రపక్షాలు నుంచి చాలామంది ఇదే అభిప్రాయంతో ఉన్నారు. కానీ ఇలా జరగడం వల్ల పాలకులు గందరగోళంలో పడతారని తాను అనుకోవడం లేదని తేల్చి చెప్పారు. వారు లోక్‌సభ ఎన్నికలపై కూడా అంతే స్థాయిలో దృష్టి పెడతారని అన్నారు.

అలాగే మహారాష్ట్రలో ప్రకటించిన తెలంగాణ మోడల్‌(రైతులకు ఆర్థిక సాయం)పై శరద్‌ పవార్‌ మాట్లాడుతూ..తెలంగాణ మోడల్‌కు గురించి తనిఖీ చేశానన్నారు. ఐతే తెలంగాణ చిన్న రాష్ట్రం, అలాంటి రాష్ట్రంలో ఇలాంటి సాయం ప్రకటించొచ్చు అన్నారు. అలాగే మహారాష్ట్రలో శాంతిభద్రతల పరిస్థితి, కొన్ని హింసాత్మక సంఘటనల గురించి ప్రశ్నించగా..శాంతిభద్రతలను నెలకొల్పాల్సిన బాధ్యత పాలకులపై ఉందని, కానీ అధికార పార్టీలు రోడ్డపైకి వచ్చి మతాల మధ్య చిచ్చు పెట్టడం మంచి పరిణామం కాదన్నారు.

అంతేగాదు రాష్ట్రంలో వ్యవసాయ సంబంధిత సమస్యలపై ఎన్సీపీ అధినేత ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ దృక్ఫథం కూడా అంత సానుకూలంగా లేదన్నారు. ఇదే క్రమంలో విలేకరులు నరేంద్ర మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తిచేసుకున్న నేపథ్యంలో కేంద్రంలో మీకు ఇష్టమైన మంత్రి ఎవరు అని అడిగిన ప్రశ్నకు పవార్‌..కొంతమంది పని విషయమై వెళ్తే వివాదాస్పదంగా మాట్లాడతారు. ఉదాహరణకు నితిన్‌ గడ్కరీ వద్దకు వెళ్తే..అతను పార్టీ కోణంలో ఉండడు. అతను పని ‍ప్రాముఖ్యతనే తనిఖీ చేస్తాడంటూ గడ్కరీపై ప్రశంసలు కురిపించారు శరద్‌ పవార్‌. 

(చదవండి: ఒడిశాలో దారుణం..డబ్బుకోసం ఆఖరికి మృతదేహాలను..)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)