Breaking News

‘శని’ వారికి వ్యాపార భాగస్వామి.. లాభాలలో వాటా కూడా!

Published on Sat, 03/09/2024 - 13:59

దేశంలో శని దేవుని ఆలయాలు చాలానే ఉన్నాయి. కానీ మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో ఒక ప్రత్యేకమైన శనిదేవుని ఆలయం ఉంది. ఇక్కడకు వచ్చే భక్తులు శనిదేవుడిని తమ వ్యాపార భాగస్వామిగా చేర్చుకుంటారు. ఇందుకోసం ఒక డాక్యుమెంట్‌ తయారు చేసి, శని దేవుని పాదాల చెంత ఉంచుతారు. ఇలా చేయడం వల్ల వ్యాపారంలో అభివృద్ధి జరుగుతుందని వారు నమ్ముతారు. ఇప్పటి వరకు 1,500 మంది వ్యాపారులు శనిదేవుడిని తమ వ్యాపార భాగస్వామిగా చేసుకున్నారు.  

ఈ ఆలయం ఖర్గోన్ జిల్లాలోని మోర్ఘడిలో శ్రీ సిద్ధ శని గజానన్ శక్తిపీఠం రూపంలో ఉంది. ఈ దేవాలయం సుమారు 21 సంవత్సరాల క్రితం నాటిది. ఇక్కడ దేవుని విగ్రహం లేదు. శిల రూపంలో శనిదేవుడు ఇక్కడ కొలువుదీరాడు. ఇక్కడికి వచ్చిన పలువురు వ్యాపారులు శనిదేవుడిని తమ వ్యాపార భాగస్వామిగా చేసుకున్నారని ఆలయ పూజారి సందీప్ బార్వే తెలిపారు. వారు వ్యాపారంలో వచ్చే లాభంలో కొంత భాగాన్ని శనిదేవునికి సమర్పిస్తారన్నారు. 

మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు ఇక్కడికి వచ్చి, తమ వ్యాపారంలో పురోగతి కోసం శనిదేవుడిని తమ వ్యాపార భాగస్వామిగా చేసుకుంటారు.  ఇందుకోసం వారు ఒక దరఖాస్తును వారు నింపుతారు. దానిలో తన వ్యాపారంలో శని దేవుడిని భాగస్వామిగా చేస్తున్నట్లు రాస్తారు. వివాదాస్పద కోర్టు కేసుల నుంచి ఉపశమనం కోరుతూ కూడా పలువురు భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)