Breaking News

ఢిల్లీలో కొనసాగుతున్న తీవ్రస్థాయి వాయు కాలుష్యం

Published on Tue, 12/16/2025 - 08:44

సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరింది. కాలుష్యానికి పొగమంచు కూడా తోడవడంతో ఢిల్లీలో వాయు నాణ్యత మరింత దిగజారింది. ప్రజలు అత్యవసర పరిస్థితులలో తప్ప బయటకు రావొద్దని అధికార యంత్రాగం జాగ్రత్తలు సూచిస్తోంది. 

ఇప్పటికే పొగమంచు నేపథ్యంలో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.  ఈ పరిస్థితుల్లో శ్వాసకోశ సమస్యలు, కంటి ఇబ్బందులు పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. భారీ పొగమంచు రవాణా వ్యవస్థపై వరుసగా రెండో రోజు కూడా ప్రభావం పడింది. విజిబులిటీ పడిపోవడంతో పలు విమానాల రాకపోకలకు అంతరాయం కలగొచ్చని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఒక్క సోమవారం నాడే 200కి పైగా విమానాలు రద్దయ్యాయి. 

AQI(గాల్లో వాయు నాణ్యత) తీవ్రత నిన్న 500 మార్కును దాటింది. అయితే ఈ రోజు ఉదయం నమోదైన డేటా ప్రకారం ఇది సుమారు 370గా ఉంది. లోధి కాలనీ, పూసా రోడ్ వంటి నిర్దిష్ట ప్రాంతాలలో స్థాయిలు సుమారు 350గా నమోదయ్యాయి. కాలుష్య స్థాయిలో కొంత ఉపశమనం ఉన్నప్పటికీ, నివాసితులు ఈ సంక్షోభంతో పోరాడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలలు హైబ్రిడ్ మోడ్‌లో కొనసాగుతున్నాయి. నర్సరీ నుంచి 5వ తరగతి చదివే విద్యార్థులకు క్లాసులను ఆన్‌లైన్‌లోనే కొనసాగించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

 

 

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)