Breaking News

ఢిల్లీలో 100 స్కూళ్లకు బాంబు బెదింపులు.. స్పందించిన ఎల్జీ

Published on Wed, 05/01/2024 - 10:23

ఢిల్లీ: ఢిల్లీ రాజధాని పరిధిలో బుధవారం  100 స్కూళ్లకు వచ్చిన బాంబు బెదిరింపుల ఘటనపై ఢిల్లీ ఎల్జీ  వీకే సక్సేనా స్పందించారు. బాంబు బెదిరింపుకు సంబంధించి వచ్చిన ఈ మెయిల్స్‌ను పోలీసులు ట్రేస్‌ చేసినట్లు వెల్లడించారు. ఈ విషయంలో​ పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని, బాంబు బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ ప్రజలకు హామీ ఇస్తున్నామని ఎల్జీ తెలిపారు.

కేంద్ర హోం శాఖ స్పందన..
ఢిల్లీ స్కూళ్ల బాంబు మెయిల్ బెదిరింపు ఘటనపై కేంద్ర హోంశాఖ స్పందించింది. పాఠశాలలకు వచ్చినవి నకిలీ బెదిరింపు మెయిల్స్‌ అని స్పష్టం చేసింది. పలు పాఠశాలలను ఢిల్లీ పోలీసులు తనిఖీ చేశారని తెలిపింది. ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలను స్కూళ్ల యాజమాన్యాలు మూసివేసినట్ల తెలిపారు.

అంతకంటే ముందు.. బాంబు బెదిరింపులై ఢిల్లీ  మంత్రి అతిశీ స్పందించారు. ‘ఇవాళ ఉదయం కొన్ని స్కూళ్లులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు విద్యార్థులను స్కూళ్ల నుంచి ఖాళీ చేయించి తనిఖీలు చేశారు. అయితే పాఠశాలల్లో ఎటువంటి బాంబు లేవని పోలీసులు గుర్తించారు. మేము స్కూళ్లు, పోలీసులతో టచ్‌లో ఉన్నాం. పిల్లల తల్లిదండ్రులు, పాఠశాలల అధికారులు ఆందోళన పడొద్దు.  స్కూళ్ల అధికారులు కూడా తల్లిదండ్రులకు టచ్‌లో ఉ‍న్నారు’ అని మంత్రి అతిశీ ‘ఎక్స్‌’ వేదికగా తెలిపారు.

దేశ రాజధాని పరిధిలో బుధవారం ఉదయం ఒక్కసారిగా అలజడి రేగింది.  పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వెంటనే పిల్లలను బయటకు పంపించి తనీఖలు చేపట్టింది. మరో వైపు ఈ సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆందోళనతో స్కూళ్ల వద్దకు  చేరుకున్నారు.

ఇప్పటివరకు 100 పాఠశాలల్లో బాంబు ఉన్నట్లు ఈ మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. మయూర్ విహార్‌లోని మదర్ మేరీ స్కూల్, ద్వారకలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌, చాణిక్య పురిలోని సంస్కృతి స్కూల్, అమిటి సాకేత్ స్కూల్, నోయిడాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన బాంబ్ స్క్వార్డ్స్, పోలీసులు స్కూల్స్‌కు వద్దకు చేరుకొని వాటి ఖాళీ చేయించి తనిఖీలు చేశారు. 

అయితే ఇప్పటి వరకు తనిఖీలు చేసిన పాఠశాలల్లో ఎలాంటి బాంబు లేవని, వచ్చింది నకిలీ బాంబు మెయిల్‌గా పోలీసులు గుర్తించారు. బయట దేశం నుంచి వీపీఎన్‌ మోడ్‌లో బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. బాంబు బెందిరింపుల నేపథ్యంలో స్కూల్స్ నుంచి విద్యార్థులను తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్లారు. బాంబు బెదిరింపు ఈ మెయిల్స్‌పై ఢిల్లీ పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)