Breaking News

భారత మత్స్యకారులను పట్టుకున్న శ్రీలంక

Published on Tue, 07/23/2024 - 13:20

తమిళనాడు తీరంలో రెండు పవర్ బోట్లతో పాటు తొమ్మిది మంది భారతీయ జాలర్లను శ్రీలంక నావికాదళం పట్టుకుంది. ఆ మత్స్యకారులు భారత సరిహద్దు దాటి చేపల వేట సాగిస్తున్నారని శ్రీలంక ఆరోపిస్తోంది. 535 బోట్లలో మత్స్యకారులు గల్ఫ్ ఆఫ్ మన్నార్‌లో చేపల వేటకు వెళ్లిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. గతంలో కూడా విదేవిధంగా శ్రీలంక భారత జాలర్లను పట్టుకుంది.

జూలై ఒకటిన రామేశ్వరం ద్వీపం సమీపంలోని పాల్క్ బే సముద్ర ప్రాంతంలో పాంబన్ నుంచి చేపల వేటకు వెళ్లిన 26 మంది భారతీయ మత్స్యకారులు శ్రీలంక నావికాదళానికి చిక్కారు. గత నెలలోనే శ్రీలంక నావికాదళం తమ సముద్ర జలాల్లో అక్రమంగా చేపల వేట సాగిస్తున్నారనే ఆరోపణలతో 18 మంది భారతీయ జాలర్లను అరెస్టు చేసింది. మూడు మత్స్యకారుల బోట్లను కూడా స్వాధీనం చేసుకుంది. దీనికిముందు కూడా శ్రీలంక నేవీ నలుగురు భారతీయ జాలర్లను అరెస్టు చేసి, వారి పడవను స్వాధీనం చేసుకుంది.

ఈ ఏడాది జనవరిలో శ్రీలంక నేవీ 12 మంది భారతీయ జాలర్లను అరెస్టు చేసింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు శ్రీలంక 180 మందికి పైగా భారత జాలర్లను అరెస్టు చేసింది. గత ఏడాది 240 నుంచి 245 మందిని అరెస్టు చేసిన నేపధ్యంలో భారత్‌-శ్రీలంక సంబంధాల్లో వివాదాలు తలెత్తాయి.

Videos

లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం

సంజు, బుమ్రా రీ ఎంట్రీ.. ఆఫ్గన్ సిరీస్ కు టీమిండియా ఇదే

snake plant ఈ మొక్క‌ల‌ని కిచెన్‌లో పెట్టుకుంటే..

మళ్లీ ఎప్పుడు పుడతావు రాజన్నా..? YSRపై భూమన భావోద్వేగ వ్యాఖ్యలు

Konda Surekha: నాకంటే ముందు రేవెంత్ పై చర్యలు తీసుకోవాలి

పులిచింతల నీరు, బీడు భూముల్లో పండిన సిరులతో YSR కు అభిషేకం

Nepal: ప్రాణాలు అరచేతిలో.. భవనంపై చిక్కుకున్న వ్యక్తి!

Kanigiri: పోలీసుల ఓవరాక్షన్.. YSR విగ్రహం వద్ద టెంట్ తొలగింపు

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

Photos

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)