Breaking News

Delhi : స్కూళ్లకు మరోసారి బాంబు బెదిరింపులు

Published on Fri, 12/13/2024 - 09:23

ఢిల్లీ: దేశ రాజధానిలో మరోసారి బాంబు కలకలం రేపింది. ఢిల్లీలోని పలు స్కూళ్లకు శుక్రవారం ఉదయం ఈ-మెయిల్‌ బెదిరింపులు వచ్చాయి. సమాచారం అందుకున్న పోలీసులు బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదని తెలిపారు. స్కూల్స్‌లో బాంబులు ఉన్నాయంటూ బెదిరింపులు రావడం వారంలో ఇది రెండోసారి.  

ఈస్ట్ ఆఫ్ కైలాష్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, సల్వాన్ స్కూల్, మోడరన్ స్కూల్,కేంబ్రిడ్జ్ స్కూల్స్‌తో పాటు ఇతర పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్‌ వచ్చాయి. దీంతో విద్యార్థులను ఇళ్లకు పంపించాలని అధికారులు సూచించారు. ఈరోజు పిల్లలను స్కూళ్లకు పంపొద్దని, ఒకవేళ పంపితే వెనక్కి తీసుకుని వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు.  

బాంబు బెదింపులు ఇ-మెయిల్స్‌ డార్క్‌ వెబ్‌ నుంచి పంపినట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. ఆ బెదిరింపుల్లో ‘మీ విద్యార్థులు స్కూల్‌లోపలికి వచ్చే సమయంలో మీరు తనిఖీలు చేయరని నమ్ముతున్నాను. మేం అమర్చిన బాంబులు భవనాలను ధ్వంసం చేయడంతో పాటు,  ప్రజలకు ప్రాణనష్టం జరగుతుంది. డిసెంబర్ 13,14, రెండు రోజులు మీ స్కూళ్లలో ఈ తరహా విధ్వంసం జరగొచ్చు. డిసెంబరు 14న పలు పాఠశాలల్లో పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌ జరగడం బాంబులు పేల్చేందుకు మాకు ఇదొక మంచి అవకాశం.మాకు కొన్ని డిమాండ్లు ఉన్నాయి. వాటిని మీరే నెరవేర్చాలి. అందుకు మీరు అంగీకరిస్తే వెంటనే మేం పంపిన మెయిల్స్‌కు రిప్లయి ఇవ్వండి ’అని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.  

అగంతకులు వచ్చిన ఇ-మెయిల్స్‌పై అప్రమత్తమైన అగ్నిమాపక శాఖ, పోలీసులు, బాంబు డిటెక్షన్ బృందాలు, డాగ్ స్క్వాడ్‌లు పాఠశాలలకు చేరుకుని తనిఖీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ పోలీసులు ఇ-ఇమెల్స్‌ వచ్చిన ఐపీ అడ్రస్‌ను పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం అన్వేషణ ప్రారంభించారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)