Breaking News

సంజయ్‌ రౌత్‌కు ఏమైంది?

Published on Sat, 11/01/2025 - 07:55

ముంబై: శివసేన (UBT) సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చేర్చారు. ఈ క్రమంలో తన అభిమానులకు, మద్దతుదారులకు ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. మరోవైపు.. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

అంతకుముందు, ఎంపీ సంజయ్‌ రౌత్‌ ట్విట్టర్‌ వేదికగా..‘అకస్మాత్తుగా తన ఆరోగ్యం క్షీణించిందని, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. ఇదే సమయంలో త్వరలోనే కోలుకుంటాననే గట్టి నమ్మకం తనకు ఉందని చెప్పారు. తన పట్ల చూపిస్తున్న ప్రేమ, నమ్మకానికి కృతజ్ఞతలు చెప్పారు. కొత్త సంవత్సరంలో అందరినీ తప్పక కలుసుకుంటాను’ అని చెప్పుకొచ్చారు. అయితే, కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాలని, పర్యటనలకు దూరంగా ఉండాలని వైద్యులు సంజయ్ రౌత్‌కు సూచించినట్టు సమాచారం​.

మరోవైపు.. సంజయ్‌ రౌత్‌ పోస్టుపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ క్రమంలో ట్విట్టర్‌ వేదికగా మోదీ.. ఆయన త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. దీనిపై సంజ​య్‌ రౌత్‌ స్పందిస్తూ.. గౌరవనీయులైన ప్రధానమంత్రి జీకి ధన్యవాదాలు!. నా కుటుంబం నుంచి మీకు కృతజ్ఞతలు! జై హింద్! జై మహారాష్ట్ర! అని బదులిచ్చారు.

ఇదిలా ఉండగా.. సంజయ్‌ రౌత్‌ ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టు తెలిసింది. కాగా, ఆయన అస్వస్థతకు కారణం ఏమిటనేది వెంటనే తెలియలేదు. అయితే గతంలో ఆయన గొంతు సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందారు. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)