మాజీ డీజీపీ కొడుకు కేసులో భయానక ట్విస్ట్‌

Published on Tue, 10/21/2025 - 14:03

మాజీ డీజీపీ కొడుకు మృతి కేసులో భయంకరమైన ట్విస్ట్‌ వెలుగు చూసింది. తన భార్యతో తన తండ్రి అనైతిక సంబంధం పెట్టుకున్నాడని.. అప్పటి నుంచి తనను మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెట్టారని, చివరకు చంపేందుకు కూడా వెనకడలేదని చెబుతున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఒక్కసారిగా అలజడి రేగింది.

పంజాబ్‌ మాజీ డీజీపీ(మానవ హక్కుల) ముహ్మద్‌ ముస్తాఫా తనయుడు అకీల్‌ అక్తర్‌(35)లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పంచకుల నివాసంలో అక్టోబర్‌ 16వ తేదీన అకీల్‌ విగతజీవిగా కనిపించాడు. అయితే డ్రగ్‌ ఓవర్‌డోస్‌ కారణంగానే చనిపోయాడంటూ ఆ కుటుంబం చెబుతూ వచ్చింది. ఈలోపు పొరుగింట్లో షామ్‌షుద్దీన్‌ చౌద్రీ ఈ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ పోలీసులను ఆశ్రయించాడు. 

పోలీసులు ఈ కేసు దర్యాప్తులో ఉండగానే.. సంచలన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అందులో తన తండ్రి తన భార్యతో సంబంధం పెట్టుకున్నాడని, తననూ చంపేందుకు కుట్ర కూడా పన్నాడని అకీల్‌ వివరించాడు. ఆగస్టు 27వ తేదీన రికార్డు చేసిన ఆ  వీడియో 16 నిమిషాల నిడివి ఉంది. ఇంకా అందులో.. 

తన తండ్రి ముస్తాఫా తన భార్యతో అనైతిక సంబంధం పెట్టుకున్నాడని.. దీంతో 2018లో ఆమెతో విడాకులు తీసుకున్నానని, ఈ విషయం తన తల్లీ, సోదరికి కూడా తెలుసని, వాళ్లు అభ్యంతర వ్యక్తం చేయకపోగా తననే నాశనం చేశారని వాపోయాడు. తనను మానసిక రోగిగా ప్రచారం చేస్తూ రిహాబిలిటేషన్‌ సెంటర్‌కు పంపారని, తన వ్యాపారాన్ని చేజిక్కించుకున్నారని..  హింసించడంతో పాటు తప్పుడు కేసులు పెడతానని బెదిరించారిని అకీల్‌ చెప్పుకొచ్చాడు.

ఈ వీడియో ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేయాలని ఫిర్యాదుదారి షాముద్దీన్‌ కోరుతున్నాడు. దీంతో.. ముస్తాపా, ఆయన సతీమణి(మాజీ మంత్రి కూడా) రజియా సుల్తానా, వీళ్ల కూతురు, కోడలి(మాజీ)పైనా బీఎన్‌ఎస్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన పంజాబ్ రాజకీయ, పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)