Breaking News

పాక్‌ దాడుల్లో సీనియర్‌ అధికారి మృతి.. సీఎం ఒమర్‌ అబ్దుల్లా ఆవేదన

Published on Sat, 05/10/2025 - 08:44

శ్రీనగర్‌: భారత్‌,పాకిస్థాన్‌ మధ్య తీవ్రమైన దాడులు కొనసాగుతున్నాయి. పాక్‌ దాడులను భారత్‌ తిప్పికొడుతోంది. మరోవైపు.. దాయాదా పాకిస్తాన్‌.. భారత్‌ సరిహద్దుల్లో పౌరులు, ఆలయాలే టార్గెట్‌గా దాడులకు తెగబడింది. తాజాగా పాక్‌ జరిపిన కాల్పుల్లో జమ్ముకశ్మీర్ ప్రభుత్వ అధికారి రాజ్‌కుమార్‌ థప్పా ప్రాణాలు కోల్పోయారు.

వివరాల ప్రకారం.. సరిహద్దుల్లో కాల్పులే కాకుండా డ్రోన్లతో దాడులు చేస్తోంది పాకిస్తాన్‌. ఈ దాడుల్లో శనివారం ఉదయం జమ్ముకశ్మీర్ ప్రభుత్వ అధికారి రాజ్‌కుమార్‌ థప్పా ప్రాణాలు కోల్పోయారు. రాజౌరీ పట్టణంలో ఉంటున్న ఆయన ఇంటిపై పాక్‌ ఫిరంగులు పడటంతో ఆయన మృతి చెందారు. రాజ్‌కుమార్‌ జిల్లా డెవలప్‌మెంట్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఈ ఘటనపై జమ్ము కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. రాజ్‌కుమార్‌ మృతిపై సీఎం ఒమర్‌ ట్విట్టర్‌ వేదికగా..‘రాజౌరీని లక్ష్యంగా చేసుకున్న పాక్‌ జరిపిన దాడుల్లో రాజ్‌కుమార్ మృతి చెందారు. నిబద్ధత కలిగిన ఓ ఆఫీసర్‌ను మనం కోల్పోయాం. ఒక్కరోజు ముందే నేను అధ్యక్షత వహించిన ఆన్‌లైన్‌ సమావేశంలో రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు. ఇంతలోనే రాజౌరీలోని ఆయన ఇంటిపై జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం.  దిగ్భ్రాంతికి గురిచేసిన ఘటనపై స్పందించేందుకు మాటలు రావడం లేదు. ఇది మాకెంతో నష్టం’ అని వ్యాఖ్యలు చేశారు.

ఇదిలా ఉండగా.. 
శుక్రవారం రాత్రి నుంచే సరిహద్దు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల పాకిస్తాన్‌ దాడులు చేసింది. దీంతో, విద్యుత్తు సరఫరా నిలిపివేసి ‘బ్లాకౌట్‌’ పాటించారు. శ్రీనగర్, పఠాన్‌ కోట్ ప్రాంతాల్లో ఉదయం కూడా పేలుళ్ల శబ్దాలు వచ్చినట్లు స్థానికులు పేర్కొన్నారు. డ్రోన్లతో పాక్‌ చేసిన దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. సరిహద్దు ప్రాంతాల్లో అధికారులు సైరన్లు మోగిస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు. విద్యుత్‌ సరఫరాను నిలిపేశారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)