Breaking News

నాడు అద్దె గదిలో జూనియర్‌ లాయర్‌గా ప్రారంభమై..నేడు సుప్రీంకోర్టు జడ్జి స్థాయికి..

Published on Fri, 05/19/2023 - 18:14

సుప్రీంకోర్టు జడ్జిగా సీనియర్‌ న్యాయవాది కల్పాతి వెంకటరామన్‌ విశ్వనాథన్‌ శుక్రవారమే ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు విశ్వనాథన్‌ ఆగస్టు 11 2030న జేబీ పార్దివాలా పదవీ విరమణ చేసిన తదనంతరం భారత ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారు. ఆయన ఈ పదవిలో మే 25, 2031 వరకు కొనసాగుతారు. ఈ సందర్భంగా ఒక చిన్న లాయర్‌గా కెరీర్‌ మొదలు పెట్టిన జస్టిస్‌ విశ్వనాథన్‌ సుప్రీం కోర్టు జడ్జి హోదాకి అంచెలంచెలుగా సాగిన సుదీర్ఘ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.

జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ 1988లో తమిళనాడు నుంచి ఢిల్లీకి వచ్చి ఆర్కేపురంలో ఓగదిలో ఉంటూ ప్రాక్టీస్‌  చేయడం ప్రారంభించారు. ఆయన తమిళనాడులోని పొల్లాచి పట్టణానికి చెందినవారు. తండ్రి కేవీ వెంకటరామన్‌ కోయంబత్తూరులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా పనిచేయడంతో ఆయన విద్యాభ్యాసం అంతా అక్కడే సాగింది.

కోయంబత్తూరు న్యాయ కళాశాలలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ లా కోర్సు పూర్తి అయిన వెంటనే సుప్రీం కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేయాలనే కోరికతో 1988లో ఢిల్లీకి వచ్చేశారు. అక్కడ నుంచే విశ్వనాథన్‌ న్యాయవాది వృత్తి ‍జర్నీ ప్రారంభమైంది. అక్కడే ఆర్కేపురంలో స్నేహితుడితో ఓ అద్దె గదిలో ఉంటూ లాయర్‌గా ప్రాక్టీస్‌ చేయడం ప్రారంభించారు. ఆ తదనంతరం ఢిల్లీలోని సీనియర్‌ లాయర్‌ దగ్గర జూనియర్‌గా పనిచేశారు.

ఆ తర్వాత సీఎస్‌ వైద్యనాథన్‌తో కలిసి పనిచేశారు. అతనితో విశ్వనాథన్‌ 1988 నుంచి 1990 వరకు హైకోర్టు, సుప్రీంకోర్టు, దిగువ కోర్టులలో పనిచేశారు. ఆ తర్వాత సీనియర్ న్యాయవాది కెకె వేణుగోపాల్‌ వద్ద 1990 నుంచి 1995 వరకు పనిచేశారు. అంతేగాదు అయోధ్య కేసులో లార్డ్‌ రామ్‌లాల తరుఫును కేసు వాదించారు.

ఇదిలా ఉండగా, 1991 నాటి ఆసక్తికరమైన సంఘటనలో, కాంగ్రెస్ నాయకుడు, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని హత్య కేసు జస్టిస్ ఎమ్‌సి జైన్ నేతృత్వంలో దర్యాప్తు జరుగుతున్నప్పుడూ జస్టిస్‌ విశ్వనాథన్‌ తన ప్రత్యర్థి వర్గానికి ట్రాన్స్‌లేటర్‌గా కూడా పని చేశారు. 

ఆ కేసులో రాజకీయ నేతలంతా ఇంగ్లీషలో మాట్లాడుతుండగా.. డీఎంకే అధినేత ఎం కరుణానిధి మాత్రం తమిళంలో మాట్లాడటంతో జస్టీస్‌ జైన్‌కు ఏం చేయాలో తోచలేదు. దీంతో కరుణానిధి మాటలను నా కోసం అనువదించగలరా అని విశ్వానథ్‌ని అడిగారు. తాను ఏఐఏడీఎంకేకు వాదిస్తున్నానని జస్టిస్‌ విశ్వనాథన్‌ చెప్పడంతో ఆయన అనువాదించడంలో ఎవరికైనా అభ్యంతరం ఉందా అని జస్టిస్‌ జైన్‌ అడిగారు. ఐతే ఎవ్వరూ ఏ సమస్య లేవనెత్తకపోయేసరికి విశ్వానాథనే తన ప్రత్యర్థి వర్గానికి ట్రాన్స్‌లేటర్‌గా చేశారు.

2009లో కేంద్ర ప్రభుత్వానికి అదనపు న్యాయవాదిగా కూడా పనిచేశారు. అంతేగాదు సుప్రీంకోర్టులో అనేక ముఖ్యమైన కేసులలో ప్రాతినిధ్యం వహించడమే గాక చాలా సున్నితమైన కేసులలో అమికస్‌ క్యూరీగా నియమితులయ్యారు. కాగా, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ తమిళనాడు నుంచి నియమితులైన మూడవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అంతకుముందు తమిళనాడు నుంచి జస్టిస్‌ పతంజలి శాస్త్రి 1951 నుంచి 1954 వరకు సీజేఐగా పనిచేశారు. 2013లో జస్టిస్‌ పీ సదాశివం తొమ్మిది నెలల పాటు ఈ పదవిలో ఉన్నారు.  

(చదవండి: ‘అది పనిష్మెంట్‌ కాదు.. మోదీ విజన్‌’)

Videos

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)