Breaking News

ప్రశ్నించేవారికి షరతు విధించిన సీమాహైదర్‌!

Published on Mon, 01/29/2024 - 10:21

పాకిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చిన సీమా హైదర్, యూపీ నివాసి సచిన్ మీనాల ప్రేమకథ దేశంలో సంచలనంగా నిలిచింది. వీరికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. దీంతో సీమాహైదర్‌ ప్రతిరోజూ హెడ్‌లైన్స్‌లో కనిపిస్తుంటుంది. 

ఈ వీడియోలు చూసిన చాలామంది ఆమె గురించి మరింతగా తెలుసుకోవాలనే ఆసక్తి చూపిస్తుంటారు. ఆమె వీడియోల కింద తమ వ్యాఖ్యానాలు, ప్రశ్నలు జోడిస్తుంటాడు. తాజాగా సీమా హైదర్‌కు చెందిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఇందులో సీమ.. తనును ఎవరైనా ఎటువంటి ప్రశ్ననైనా అడగవచ్చని, అయితే దానికి ఒక షరతు ఉందని పేర్కొంది. 

సచిన్, సీమ హైదర్ ప్రేమకథ వార్తల్లో నిలిచింది. కొన్నాళ్ల క్రితం ఆన్‌లైన్‌లో పబ్జీ గేమ్ ఆడుతున్నప్పుడు వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారిద్దరూ నేపాల్‌లో కలుసుకున్నారు. అక్కడే తాము పెళ్లి చేసుకున్నామని గతంలో వారు చెప్పారు. సీమా పాకిస్తాన్ నుంచి తన నలుగురు పిల్లలతో సహా భారత్‌కు అక్రమంగా తరలి వచ్చింది. అప్పటి నుంచి ఆమె నోయిడాలో భర్తతో పాటు ఉంటోంది. 

సచిన్, సీమా హైదర్‌లకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. కొన్ని రోజుల క్రితం సీమా హైదర్, సచిన్‌ల వీడియో వైరల్‌గా మారింది. తన గురించి తెలుసుకోవాలనుకుంటున్నవారు  ఏదైనా ప్రశ్న అడగవచ్చని ఆమె పేర్కొంది. 

తన గత, ప్రస్తుత జీవితం గురించి ఎవరైనా ఏదైనా అడగవచ్చని, అయితే మంచి విషయాలు గురించి అడిగితే మాత్రమే సమాధానం తన నుంచి వస్తుందని తెలిపింది. అంటే మంచి ప్రశ్నలను మాత్రమే అడగాలని ఆమె షరతు విధించించిందన్నమాట. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. సీమా హైదర్  ఇటీవల హిందూ పండుగలను జరుపుకుంటూ వార్తల్లో నిలిచారు. 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)