Breaking News

‘మహా’తీరంలో పాక్‌ నౌక?.. అంతటా హై అలర్ట్‌

Published on Mon, 07/07/2025 - 13:26

ముంబై: మహారాష్ట్ర తీరంలో కలకలం చెలరేగింది. భారత నావికాదళ రాడార్ సముద్రంలో ఒక అనుమానాస్పద నౌకను గుర్తించగా, అది పాకిస్తాన్ ఫిషింగ్ నౌక అయివుండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేవ్‌దండా తీరం సమీపంలో ఈ అనుమానాస్పద నౌక కనిపించిన దరిమిలా  మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ తీరం వెంబడి భద్రతను మరింతగా పెంచారు.

తీరం వెంబడి పోలీసు దళాలను మోహరించారు.  ముందు జాగ్రత్త చర్యగా రాయగఢ్‌ జిల్లాలో భద్రతను పెంచారని ఒక అధికారి తెలిపారు. ఆదివారం రాత్రి భారత నావికాదళ రాడార్‌  రెవ్‌దండాలోని కొర్లై తీరానికి రెండు నాటికల్ మైళ్ల దూరంలో అనుమానస్పద నౌకను గుర్తించింది. ప్రస్తుతం పోలీసులు,  సముద్రతీర భద్రతా  సిబ్బంది ఆ నౌక కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. రాయ్‌గడ్ పోలీసులు, క్విక్ రెస్పాన్స్ టీమ్ (క్యూఆర్‌టీ), బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (బీడీడీఎస్‌), నేవీ కోస్ట్ గార్డ్ సిబ్బంది  అనుమానాస్పద నౌక ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు. రాయ్‌గడ్ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్ఫీ) అంచల్ దలాల్, ఇతర సీనియర్ పోలీసు అధికారులు తీరానికి చేరుకున్నారు.  ఆ నౌకను చేరుకునేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే వాతావరణం అనుకూలంగా లేని కారణంగా వారు వెనుదిరిగారు. భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా పడవను గుర్తించి, దానిని చేరుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)