Breaking News

అతీఖ్‌ హంతకుల జైలు మార్పు

Published on Mon, 04/17/2023 - 18:24

లక్నో: ఉత్తర ప్రదేశ్‌ గ్యాంగ్‌స్టర్‌-పొలిటీషియన్‌ అతీఖ్‌ అహ్మద్‌, అతని సోదరుడు అష్రాఫ్‌లను కాల్చి చంపిన నిందితులను అధికారులు జైలు మార్చారు. సన్నీ సింగ్‌, అరుణ్‌ మౌర్యా, లవ్‌లేష్‌ తొవారిలను ప్రయాగ్‌రాజ్‌ నైనీ జైలు నుంచి ప్రతాప్‌ఘడ్‌ జైలుకు మార్చేశారు ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు. నైనీ జైలులో వాళ్లపై దాడి జరగవచ్చేనే నిఘా వర్గాల సమాచారం మేరకు ముగ్గురు హంతకులను జైలు మార్చేసినట్లు అధికారులు వెల్లడించారు.    

ఫేమస్‌ కావాలనే తాము అహ్మద్‌ గ్యాంగ్‌ను ఏరివేసే పనిలో దిగామని, ఈ క్రమంలోనే అతీఖ్‌, అతని సోదరుడిని కాల్చిచంపామని ఈ ముగ్గురు పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించారు. మరోవైపు కోర్టు వీళ్లకు 14 రోజుల జ్యూడీషియల్‌ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. 

ఇక అతీఖ్‌,అష్రాఫ్‌ల హత్య ఘటనపై ముగ్గురు సభ్యులతో కూడిన జ్యూడీషియల్‌ ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేసింది యూపీ ప్రభుత్వం. మరోవైపు యూపీ పోలీస్‌ శాఖ కూడా రెండు సిట్‌(స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం)లను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. 

యూపీ పోలీసుల కథనం ప్రకారం.. శనివారం రాత్రి అతీఖ్‌, అష్రాఫ్‌లను వైద్యపరీక్షల కోసం తరలిస్తుండగా జర్నలిస్టుల ముసుగులో వచ్చిన ఆ ముగ్గురు.. తుపాకులతో కాల్చి చంపిన తర్వాత జై  శ్రీరామ్‌ నినాదాలు చేస్తూ పోలీసులకు లొంగిపోయారు. వాళ్ల నుంచి ఫేక్‌ ఐడీకార్డులు , కెమెరా, మైక్‌లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ముగ్గురిలో లవ్‌లేష్‌కు తూటా కాలి నుంచి దూసుకుపోవడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. 

అంతకు ముందు.. బుధవారం ఝాన్సీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో  ఉమేష్‌పాల్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అతీఖ్‌ తనయుడు అసద్‌ అహ్మద్‌ను, అతన్ని అనుచరుడ్ని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)