Breaking News

అదే తరహాలో రెండో ఘటన: ఎయిర్‌ ఇండియాకి మరోసారి షాక్‌

Published on Tue, 01/24/2023 - 16:24

ఎయిర్‌ ఇండియా ఇటీవలే న్యూఢిల్లీ నుంచి ఢిల్లీ వెళ్లే విమానంలోని మూత్ర విసర్జన ఘటనలో భారీ జరిమానాను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. మళ్లీ మరోసారి భారీ మొత్తంలో పెనాల్టీని ఎదుర్కొని వార్తల్లో నిలిచింది. ఈ మేరకు డీజీసీఏ మరోసారి ఎయిర్‌ ఇండియాకు రూ. 10 లక్షల జరిమాన విధించి షాక్‌ ఇచ్చింది. ఆ మూత్ర విసర్జన ఘటన తదనంతరం ఇదే తరహాలో మరో ఘటన జరిగింది ఈ మేరకు గత నెల డిసెంగర్‌ 6న ప్యారిస్‌ నుంచి ఢిల్లీ వెళ్లే ఎయిర్‌ ఇండియా విమానంలో ఇలాంటి మాత్ర విసర్జన ఘటనే చోటు చేసుకుంది.

కాకపోతే అక్కడ ప్రయాణికుడు మహిళ కూర్చోవాల్సిన ఖాళీ సీటులో మూత్ర విసర్జన చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయం గురించి డీజీసీఏ ఆరా తీసేంతవరకు నివేదించలేదని అంతర్గత కమిటీ పేర్కొంది. దీంతో డీజీసీఏ ఎయిర్‌ ఇండియాకు రూ. 10 లక్షల జరిమానా విధించింది. తాను ఈ ఘటన గురించి వివరణ అడిగేంత వరకు చెప్పకుండా జాప్యం చేసినందుకు గానూ పెనాల్టీ విధించినట్లు డీజీసీఏ స్పష్టం చేసింది. అంతేగాదు ఎయిర్‌ ఇండియా ప్రయాణకుల వికృత చర్యలకు సంబంధించిన నిబంధనలను తాము పాటించలేకపోయామని డీజీసీఏకు తెలపడం గమనార్హం. 

(చదవండి: విమానంలో మూత్ర విసర్జన ఘటన.. ఎయిరిండియాకు డీజీసీఏ షాక్‌.. భారీ పెనాల్టీ)

#

Tags : 1

Videos

NTR District: YSRCP బ్యానర్లు తొలగించడంపై అసహనం

నాలుగు నెలల్లో వచ్చేది మేమే... Amit Shah

అనంతపురంలో పోలీసుల అత్యుత్సాహం

Shyamala: మీసం ఎప్పుడు తీస్తారు మంత్రిగారు

కోర్టు ఆదేశించిన తర్వాత భూ సేకరణ చేస్తారా: అంబటి రాంబాబు

చంద్రశేఖర్ రెడ్డి సంచలన కామెంట్స్

ఇరిగేషన్ శాఖలో భారీ అవినీతి: మాజీ మంత్రి కాకాణి

రాంప్రసాద్ రెడ్డి తొడగొట్టి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్

ఐబొమ్మ రవి కన్ఫెషన్ రిపోర్ట్ లో కీలక అంశాలు

New Year Day: మద్యం ప్రియులకు గుడ్ న్యూస్

Photos

+5

అన్షులా కపూర్ బర్త్ డే పార్టీ.. జాన్వీ కపూర్ మిస్సింగ్ (ఫొటోలు)

+5

చిరంజీవి-వెంకటేశ్ మెగా విక్టరీ మాస్ సాంగ్ (ఫొటోలు)

+5

గోల్డెన్ బ్యూటీలా హీరోయిన్ శోభిత (ఫొటోలు)

+5

పెళ్లి, షూటింగ్.. ఈ ఏడాది జ్ఞాపకాలతో హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

యూత్‌ హార్ట్‌ బ్రేక్‌ అయ్యేలా 'నిధి అగర్వాల్‌' (ఫోటోలు)

+5

వైకుంఠ ఏకాదశి : తిరుమలలో వైభవంగా స్వర్ణ రథోత్సవం (ఫొటోలు)

+5

తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం.. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు (చిత్రాలు)

+5

‘శంబల’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

భద్రాచలం : కన్నుల పండువగా శ్రీ సీతారాముల తెప్పోత్సవం (ఫొటోలు)

+5

ముక్కోటి ఏకాదశి..తిరుమలలో ప్రముఖుల సందడి (ఫొటోలు)