Breaking News

పాలియేటివ్‌ కేర్‌పై మార్గదర్శకాల అమలు విధానాన్ని తెలపండి 

Published on Tue, 10/14/2025 - 06:29

న్యూఢిల్లీ: పాలియేటివ్‌ కేర్‌పై 2017లో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ జారీ చేసిన మార్గదర్శకాల అమలుపై వివరాలు తెలియజేయాలని సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు మూడు వారాల గడువు ఇచి్చంది. కేసు తదుపరి విచారణను నవంబర్‌ 25కు వాయిదా వేసింది. టర్మీనల్‌ ఇల్‌నెస్‌ (వ్యాధి)తో బాధపడుతున్న రోగులకు జాతీయ ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా పాలియేటివ్‌ కేర్‌ విధానాన్ని వర్తింపజేయాలంటూ దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ సందీప్‌ మెహతా బెంచ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కేంద్రానికి ఈ ఆదేశాలను జారీ చేసింది. కేంద్రం మాత్రమే కాకుండా రాష్ట్రాల నుండి కూడా సమగ్ర సమాచారం సేకరించి తెలియజేయాలని కేంద్రం తరఫు హాజరైన అదనపు సాలిసిటర్‌ జనరల్, సీనియర్‌ న్యాయవాదిని ధర్మాసనం ఆదేశాలిచి్చంది.  

పాలియేటివ్‌ కేర్‌: తీవ్రమైన లేదా చివరి దశ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు అందించే ప్రత్యేక వైద్య సంరక్షణ విధానం. 
టర్మీనల్‌ ఇల్‌నెస్‌ రోగి: నయంకాని వ్యాధి లేదా వైద్య పరిస్థితితో బాధపడుతూ, చివరికి మరణానికి దారితీసే అవకాశం ఉన్న వ్యక్తి.  
 

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)