Breaking News

పీఎఫ్‌ వేతన పరిమితి పెంపుపై 

Published on Tue, 01/06/2026 - 05:56

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి పథకం (ఈపీఎఫ్‌ఓ) పథకం లబ్ధిదారుల అర్హతకు సంబంధించిన గరిష్ట వేతన పరిమితిని పెంచడంపై నాలుగు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. నెలవారీ వేతనం రూ.15 వేలకు మించిన వారికి పీఎఫ్‌ పథకం వర్తించదన్నది తెలిసిందే. దీన్ని గత 11 ఏళ్లుగా సవరించకపోవడాన్ని ప్రశ్నిస్తూ నవీన్‌ ప్రకాశ్‌ నౌటియాల్‌ అనే సామాజిక కార్యకర్త సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. నెలవారీ వేతనం 15 వేలకు మించితే పీఎఫ్‌ ప్రయోజనాలు దక్కకపోవడం దారుణమని ఆయన ఆరోపించారు. 

కేంద్రంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన కనీస నెలవారీ వేతన మొత్తమే రూ.15 వేలకు మించి ఉందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో 15 వేల పరిమితి వల్ల పీఎఫ్‌ పథకం తాలూకు సామా జిక సంక్షేమ ఫలాలు చాలామంది అర్హులైన చిరుద్యోగులకు అందకుండా పోతున్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు. దాంతో, పీఎఫ్‌ వేతన పరిమితి పెంపుపై 4 నెలల్లో కేంద్రం నిర్ణయం తీసుకోవాలంటూ న్యాయ మూ ర్తులు జస్టిస్‌ జె.కె.మహేశ్వరి, జస్టిస్‌ ఎ.ఎస్‌.చందూర్కర్‌ ధర్మాసనం సోమ వారం తీర్పు వెలువరించింది. తమ తీర్పు కాపీని జత పరు స్తూ రెండు వారాల్లోగా కేంద్రానికి విన తిపత్రం ఇవ్వాల్సిందిగా పిటిషనర్‌కు సూచించింది.

ఉపసంఘమే చెప్పినా: పీఎఫ్‌ పథకం లబ్ధిదారుల గరిష్ట వేతన పరిమితి పెంపుపై నిర్దిష్ట నియమ నిబంధనలేవీ లేవు. దాంతో దాని సవరణ విషయంలో ఒక క్రమమంటూ లేకుండా పోయింది. ఒకసారి 12 ఏళ్లకు, మరోసారి 13, 14 ఏళ్లకు గరిష్ట వేతన పరిమితిని సవరించారు. పైగా ద్రవ్యోల్బణం, తలసరి ఆదాయం, ఆర్థిక సూచనలను కూడా పెద్దగా పరిగణనలోకి తీసు కోవడం లేదన్నది సామాజిక కార్యకర్తల ఆరోప ణ. దీనివల్ల అర్హులైన చిరుద్యోగులెందరో పీఎఫ్‌ పథకం ఫలాలకు దూరమవుతున్నారని నౌటియాల్‌ తన పిటిషన్‌లో ఆవేదన వెలిబుచ్చారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)