Breaking News

నేడు పాఠశాలలకు సెలవు

Published on Thu, 08/28/2025 - 07:55

న్యూఢిల్లీ: భారీ వర్షాలు, వినాయకచవితి వేడుకలు, ఓనం ఉత్సవాల నేపధ్యంలో పలు రాష్ట్రాలోని పాఠశాలలకు ఆగస్టు 28(గురువారం) సెలవు ప్రకటించారు. దేశంలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో కొన్ని రాష్ట్రాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. వాతావరణ శాఖ కూడా పలు రాష్ట్రాలకు ప్రమాద హెచ్చరికలు చేసింది. దీనిని గమనించిన ఆయా రాష్ట్రాల విద్యాశాఖలు పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. ఏఏ రాష్ట్రాల్లో నేడు(గురువారం) సెలవు ప్రకటించారనే విషయానికొస్తే..

పంజాబ్
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు బుధవారం నుంచి ఆగస్టు 31 పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ సెలవులను పొడిగించే అవకాశం కూడా ఉంది. రుతుపవనాలకు రాష్ట్రం తీవ్రంగా ప్రభావితమైంది. రాష్ట్రంలోని రంజిత్ సాగర్, భాక్రా ఆనకట్టల నుండి నీటి విడుదల, సట్లూజ్, బియాస్, రావి వంటి నదులలో నీటి మట్టాలు పెరగడం కారణంగా పలు జిల్లాల్లో వరదలు సంభవించాయి.

ఉత్తరాఖండ్, జమ్ము

జమ్మూలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లో వరదలు సంభవించాయి. కొండచరియలు కూడా విరిగిపడ్డాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. పాఠశాల విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, ఆగస్టు 28న పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

దక్షిణాదిన..
దక్షిణ భారతంలోని పలు రాష్ట్రాల్లోని పాఠశాలలకు ఆగస్టు 28న సెలవు ప్రకటించారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, గోవా, కేరళలలో గణేష్ చతుర్థిని ఆగస్టు 27న జరుపుకున్నారు. అయితే వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో  28న సెలవు ప్రకటించే అవకాశం ఉంది. కేరళలో ఓణం వేడుకలు ఆగస్టు 28 వరకు జరగనున్నాయి.నేపధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించారు.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)