గుండెపోటు అనుకుని ఎడాపెడా సీపీఆర్‌.. ఆసుపత్రిలో బిగ్‌ ట్విస్ట్‌!

Published on Sat, 08/01/2026 - 09:10

ఓ ప్రాణాన్ని కాపాడాలన్న ఆత్రం.. ఓ పొరపాటు అంచనా.. చివరకు ఊహించని గాయాలకు దారితీసింది. రోడ్డుపై కుప్పకూలిన ఓ టీచర్‌ను గుండెపోటు వచ్చిందని భావించిన ఇద్దరు యువకులు ఆమెకు వెంటనే CPR చేశారు. కానీ, ఆసుపత్రికి వెళ్లాక అసలు విషయం బయటపడింది. ఆమెకు గుండెపోటు రాలేదు.. అయితే తప్పుడు విధానంలో చేసిన CPR కారణంగా రెండు పక్కటెముకలు విరిగిపోయాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వివరాల ప్రకారం.. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని కైలారస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, తీవ్ర ఎండ వేడిమి కారణంగా టీచర్‌ లలిత స్కూటీపై వెళ్తుండగా ఒక్కసారిగా తల తిరిగింది. దీంతో, వాహనంపై నుంచి అదుపుతప్పి కిందపడిపోయారు. క్షణాల్లోనే ఆమె చుట్టూ జనం గుమిగూడారు. ఇంతలో అక్కడే ఉన్న ఇద్దరు యువకులు పరిస్థితిని చూసి ఆమెకు గుండెపోటు వచ్చిందని భావించారు. ఆలస్యం చేస్తే ప్రాణాపాయం ఉంటుందని అనుకుని వెంటనే CPR చేయడం ప్రారంభించారు. ప్రాణాలు కాపాడాలనే ఆందోళనలో పదేపదే ఛాతీపై ఒత్తిడి చేశారు.

కానీ, వారికి CPR చేసే సరైన పద్ధతి తెలియకపోవడంతో అదే ఆమెకు మరో సమస్యగా మారింది. కొంత సమయం తర్వాత లలితను ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించగా.. గుండెపోటు ఆనవాళ్లు కనిపించలేదు. ఎండ వేడి, నీరసం కారణంగానే ఆమె స్పృహ కోల్పోయినట్లు గుర్తించారు. అయితే, వైద్య పరీక్షల్లో మరో విషయం బయటపడింది. CPR సమయంలో అధిక ఒత్తిడి కారణంగా ఆమెకు రెండు పక్కటెముకలు విరిగినట్లు వైద్యులు గుర్తించారు.

ప్రాణం కాపాడాలన్న ఉద్దేశంతో చేసిన ప్రయత్నం ఆమెకు ఇలా ఊహించని గాయాలకు దారితీసింది. అత్యవసర పరిస్థితుల్లో CPR ఎంతో కీలకమైనప్పటికీ, దాన్ని సరైన పద్ధతిలో చేయడం అంతే ముఖ్యం. శిక్షణ లేకుండా చేసే ప్రయత్నాలు కొన్నిసార్లు ప్రాణాలను కాపాడటానికి బదులుగా కొత్త సమస్యలను సృష్టించే అవకాశం ఉందని ఈ ఘటన మరోసారి గుర్తుచేసింది.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)