Breaking News

స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ఓవరాక్షన్‌ .. నాన్‌వెజ్‌ తీసుకొచ్చాడని విద్యార్ధి సస్పెండ్‌

Published on Fri, 09/06/2024 - 10:41

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ స్కూల్‌లో ప్రిన్సిపాల్‌ అమానుషంగా ప్రవర్తించాడు. అయిదేళ్ల విద్యార్ధిని క్లాస్‌లోకి మాంసాహారం తెచ్చాడని అతడిని సస్పెండ్‌ చేవారు. ఈ ఘటన అమ్రోహాలోని ఓ ప్రవేటు పాఠశాలలో వెలుగుచూసింది. గురువారం ఉపాధ్యాయుల దినోత్సవం రోజు హిల్టన్‌ కాన్వెంట్‌ స్కూల్‌లో చదువుతున్న నర్సరీ విద్యార్ధి తన లంచ్‌ బాక్స్‌లో మాంసాహారాన్ని పాఠశాలకు తీసుకొచ్చాడు. 

ఇది గమనించిన ప్రిన్సిపల్‌ బాలుడిని స్కూల్‌ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలిపాడు. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లి పాఠశాలకు వచ్చి ప్రిన్సిపల్‌ను నిలదీసింది. పాఠశాలలకు మాంసాహారం తీసుకొచ్చే పిల్లలకు మంచి బుద్దులు చెప్పడం తమకు ఇష్టం లేదని ఆమెతో ప్రిన్సిపల్‌  వాగ్వాదానికి దిగారు. 

అంతేగాక విద్యార్థి తరుచుగా మాంసాహారాన్ని తీసుకువస్తున్నట్లు చెప్పాడు. మాంసాహారం తినేలా చేయడం వల్ల అందరినీ ఇస్లాంలోకి మార్చాలనుకుంటున్నాననని, తాను హిందూ దేవాలయాలను ధ్వంసం చేయాలనుకుంటున్నట్లు తనతో విద్యార్ధి చెబుతున్నాడని ఆరోపించారు. 

ప్రిన్సిపల్‌ మాటలపై స్పందించిన విద్యార్ధి తల్లి తన క్లాస్‌లోని విద్యార్థులు కేవలం హిందూ-ముస్లిం’ అంటూ వేరు చేసి మట్లాడుతున్నారని చేస్తున్నారంటూ తన కొడుకు గత మూడు నెలలుగా ఫిర్యాదు చేస్తున్నాడని చెప్పింది. తన బిడ్డను అతని తరగతిలో కూర్చోనివ్వడం లేదని మహిళ ఆరోపించింది. అయితే దీంతో ఆగ్రహించిన ప్రిన్సిపాల్.. సదరు విద్యార్థికి చదువు నేర్పడం ఇష్టం లేదని, అతన్ని బహిష్కరిస్తున్నట్లు చెప్పారు.

విద్యార్ధి తల్లి, ప్రిన్సిపల్‌ మధ్య సంభాషణను వీడియో రికార్డు చేయడంతో.. వైరల్‌గా మారింది. దీంతో ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేయాలని, పాఠశాలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ అమ్రోహి ముస్లిం కమిటీ.. జిల్లా మేజిస్ట్రేట్‌కు లేఖ రాసింది. అమ్రోహా ప్రాథమిక విద్యాశాఖాధికారి మూడు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయుల బృందాన్ని ఏర్పాటు చేసి ఈ అంశంపై విచారణ జరిపి మూడు రోజుల్లోగా తమ నివేదికను సమర్పించాలని ఆదేశించారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)