Breaking News

రెండు రోజుల్లో ఇద్దరు.. మరో విద్యార్థిని ఆత్మహత్య

Published on Sat, 11/22/2025 - 10:50

ముంబై: ఢిల్లీలో విద్యార్థి శౌర్య పాటిల్‌ మృతి ఘటన మరువక ముందే మహారాష్ట్రలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రలో ఎనిమిదో తరగతి విద్యార్థిని(13) పాఠశాల భవనంలోని మూడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, ఉపాధ్యాయుల వేధింపుల కారణంగానే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని పేరెంట్స్‌ ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనపై సీఐ సందీప్‌ భారతీ తెలిపిన వివరాల ప్రకారం.. జల్నా నగరంలోని CTMK గుజరాతీ విద్యాలయంలో ఆరోహి దీపక్ బిట్లాన్(13) ఎనిమిదో తరగతి చదువుతోంది. ప్రతీరోజు మాదిరిగానే ఆమె.. శుక్రవారం పాఠశాలకు వచ్చింది. అనంతరం, ఉదయం 7:30 గంటల ప్రాంతంలో పాఠశాల భవనంలోని మూడవ అంతస్తు నుంచి దూకింది. దీంతో, వెంటనే ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి తర్వాత.. సివిల్‌ ఆసుపత్రికి తరలించారు. పాఠశాల యాజమాన్యం ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు అ‍క్కడికి చేరుకున్నారు. కానీ, అప్పటికే బాధితురాలు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. పాఠశాలలో ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లభ్యం కాలేదన్నారు.

మరోవైపు, బాధితురాలు తల్లిదండ్రులు తమ బిడ్డ మరణంపై మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల నిరంతర వేధింపులు, చిత్రహింసల కారణంగానే మా కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. చాలా రోజులుగా ఆమె ఆవేదనతో ఉంది. కానీ, తను ఇలా ఆత్మహత్య చేసుకుంటుందని ఊహించలేదు. మాకు న్యాయం కావాలి.  మా బిడ్డను వేధించిన పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి. ఇక, విద్యార్థిని మృతిపై పాఠశాల ప్రిన్సిపాల్‌ స్పందిస్తూ.. ఆమె మృతి విషాదకరమని అన్నారు. దీనిపై దర్యాప్తునకు పూర్తిగా సహకరించనున్నట్టు తెలిపారు. పోలీసులు తమ విచారణను పూర్తి చేసిన తర్వాతే వాస్తవాలు స్పష్టంగా తెలుస్తాయని అన్నారు.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)