Breaking News

సుప్రీం కోర్టులో ఆప్‌ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

Published on Mon, 08/05/2024 - 12:24

ఢిల్లీ: సుప్రీం కోర్టులో ఢిల్లీలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌ సభ్యులను నామినేట్ చేసే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్‌కు(ఎల్జీ) ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం ఎల్జీకి నామినేట్‌ చేసే అధికారం వచ్చిందని తెలిపింది. ఎంసీడీలో 10 మంది కౌన్సిలర్లను మంత్రి మండలి సలహా మేరకు నామినేట్ చేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు..  లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ ప్రభుత్వ సలహాను పాటించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఇది చట్టబద్ధమైన అధికారమని, కార్యనిర్వాహక అధికారం కాదని స్పష్టం చేసింది. కార్పొరేషన్‌ సభ్యుల నామినేషన్‌కు సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సలహా తీసుకోవాల్సిన అవసరం ఎల్జీకి లేదని పేర్కొంది.

2022 డిసెంబర్‌లో జరిగిన ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆప్‌ గెలుపొందింది. కాగా, మొత్తం 250 వార్డుల్లో మెజార్టీ మార్క్‌(126)ను దాటి ఆప్‌ 134 స్థానానాల్లో విజయం సాధించింది. ఈ క్రమంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నియమించిన 10 మంది నామినేటెడ్ కౌన్సిలర్స్‌ చేత ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో ఎల్జీకి కౌన్సిర్లను నియమించే  అధికారం లేదని ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. అనంతరం  ఈ వ్యవహారంపై ఆప్‌ సుప్రీం కోర్టును అశ్రయించింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)