Breaking News

ఒంటరి తల్లుల సంతానానికి ఓబీసీ సర్టిఫికెట్‌

Published on Tue, 06/24/2025 - 06:11

న్యూఢిల్లీ: ఒంటరి తల్లుల పిల్లలకు ఓబీసీ(ఇతర వెనుకబడిన కులాల)సర్టిఫికెట్ల జారీకి సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇందుకు సంబంధించి త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు తెలిపింది. తద్వారా తండ్రి వైపు నుంచి ధ్రువీకరణ పత్రాల అవ సరం లేకుండానే వీటిని మంజూరు చేసేందుకు అవ కాశం ఏర్పడనుంది. ‘ఒంటరి తల్లుల పిల్లలకు ఓబీసీ సర్టిఫికెట్‌ జారీకి సంబంధించిన చాలా ముఖ్యమైన అంశమిది. 

ఒంటరి తల్లి ఓబీసీకి చెందిన వారైతే ఆమె కుల ధ్రువీకరణ ఆధారంగా ఆమె పిల్లలకూ ఓబీసీ సర్టిఫికెట్‌ జారీ చేయాలని పిటిషనర్‌ కోరుతు న్నారు. ప్రస్తుతమున్న మార్గదర్శకాల ప్రకా రం తండ్రి, లేదా రక్త సంబంధీకులు ఓబీసీకి చెందిన వారైతేనే ఆ పిల్లలకు ఓబీసీ సర్టిఫికెట్‌ అందజేస్తున్నా రు. దీని వల్ల ఒంటరి తల్లులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు’అని సోమవారం విచారణ సందర్భంగా జస్టిస్‌ కేవీ విశ్వనాథన్, జస్టిస్‌ ఎన్‌.కోటీశ్వర్‌ సింగ్‌ ధర్మాసనం పేర్కొంది. ‘ఈ అంశం చాలా ముఖ్యమైంది. కొన్ని అంశాలను పరిష్కరించిన తర్వాత మార్గదర్శకాలను జారీ చేస్తాం’అని జస్టిస్‌ విశ్వనాథన్‌ వాదనల సందర్భంగా పేర్కొన్నారు.

 ‘విడాకులు తీసుకున్న ఒక మహిళ పిల్లల ఓబీసీ కులధ్రువీకరణ పత్రం కోసం మాజీ భర్త వద్దకు ఎలా వెళ్లగలదు?’అని ఆయన ప్రశ్నించారు. ఈ పిటిషన్‌పై ఈ ఏడాది ఫ్రిబవరిలో విచారణ చేపట్టిన ధర్మాసనం కేంద్రానికి, ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణ సందర్భంగా అదనపు సొలిసిటర్‌ జనరల్‌ సంజయ్‌ జైన్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వాదనలు వినిపించారు. 2012 నాటి రమేశ్‌భాయ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ గుజరాత్‌ కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఉదహరించారు. ఒంటరి తల్లుల పిల్లలకు ఓబీసీ సర్టిఫికెట్ల జారీకి సంబంధించిన మార్గదర్శకాలను వెలువ రించాలని విన్నవించారు. ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణను జూలై 22వ తేదీకి వాయిదా వేసింది.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)