Breaking News

‘ఎమర్జెన్సీ’ నిర్ణయాలన్నీ... చెల్లవని చెప్పలేం

Published on Sat, 11/23/2024 - 05:07

న్యూఢిల్లీ: ఎమర్జెన్సీ అమల్లో ఉన్నంత మాత్రాన ఆ సమయంలో పార్లమెంటు తీసుకున్న నిర్ణయాలేవీ చెల్లబోవని చెప్పలేమని సుప్రీంకోర్టు శుక్రవారం అభిప్రాయపడింది. రాజ్యాంగ ప్రవేశికలో ‘సామ్యవాద, లౌకిక, సమగ్రత’ పదాలను జోడిస్తూ ఎమర్జెన్సీ సమయంలో చేసిన 42వ సవరణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. 

ఆ పదాలపై ఇప్పటికే సుప్రీంకోర్టు పలుమార్లు న్యాయ సమీక్ష జరిపిందని సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ ధర్మాసనం గుర్తు చేసింది. తామిప్పుడు ఆ నిర్ణయంలో తాలూకు మంచిచెడుల్లోకి వెళ్లదలచు కోలేదని స్పష్టం చేసింది. ఈ అంశంపై విచారణను ముగించింది. నవంబర్‌ 25న తీర్పు వెలువరించనున్నట్టు ప్రకటించింది. దీన్ని విస్తృత ధర్మాసనానికి నివేదించాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది. 

1976లో ఎమర్జెన్సీ అమల్లో ఉండగా నాటి కాంగ్రెస్‌ ప్రధాని ఇందిరాగాంధీ 42వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. తద్వారా రాజ్యాంగ ప్రవేశికలో ‘సార్వభౌత, ప్రజాస్వామిక గణతంత్రం’ అన్నచోట ‘సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామిక గణతంత్రం’ అని చేర్చారు. దీన్ని సవాలు చేస్తూ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి, అడ్వొకేట్‌ విష్ణుశంకర్‌ జైన్‌ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం విచారించింది. 

42వ రాజ్యాంగ సవరణ ఇప్పటికే ఎన్నోసార్లు సుప్రీంకోర్టు న్యాయ సమీక్షకు గురైందని, పార్లమెంటు కూడా దీనిపై జోక్యం చేసుకుందని సీజేఐ గుర్తు చేశారు. మన దేశంలో సామ్యవాద అనే పదానికి సంక్షేమ రాజ్యమనే అర్థమే వాడుకలో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ఈ విషయంలో ఇతర దేశాలకు, మనకు చాలా తేడా ఉంది. ప్రైవేట్‌ రంగ వికాసాన్ని మనమెప్పుడూ నిరోధించలేదు. 

మనమంతా ఆ రంగ వృద్ధి వల్ల లాభపడ్డవాళ్లమే’’ అని చెప్పుకొచ్చారు. లౌకికవాదం రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగమని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టం చేసిందని గుర్తు చేశారు. సామ్యవాదం, లౌకికవాదం పదాలను రాజ్యాంగ ప్రవేశికలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు మరో అడ్వొకేట్‌ అశ్వినీ ఉపాధ్యాయ్‌ పేర్కొన్నారు. ధర్మాసనం స్పందిస్తూ, ప్రవేశిక రాజ్యాంగంలో భాగమేనని స్పష్టం చేసింది. ఆర్టికల్‌ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించేందుకు పార్లమెంటుకు ఉన్న అధికారం ప్రవేశికకూ వర్తిస్తుందని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)