Breaking News

బీమా కొరేగావ్ కేసు: ఇద్దరు నిందితులకు సుప్రీంకోర్టు ఊరట

Published on Fri, 07/28/2023 - 16:11

ముంబయి: బీమా కొరేగావ్ కేసులో నిందితులుగా ఉన్న ఎల్గార్ పరిషత్ సభ్యులు వెర్నాన్ గోన్సాల్వేస్, అరుణ్ ఫెరీరాలకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తీవ్రవాద వ్యతిరేక నిరోధక చట్టం (ఊపా) కింద అరెస్టైన వీరిద్దరి బెయిల్ పిటీషన్‌ను 2021 డిసెంబర్‌లో బాంబే హైకోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. బీమా కోరేగావ్ కేసులో హింసను ప్రేరేపించారనే ఆరోపణలపై 2018లో వీరిని అరెస్టు చేశారు. అప్పటి నుంచి ముంబయిలోని తలోజా జైలులో నిర్భందించారు.

ఐదేళ్లపాటు వరుసగా కస్టడీలోనే ఉన్నందున కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. నిందితులపై ఉ‍న్న ఆరోపణలు తీవ్రమైనవి అనే ఒక్క కారణంతో బెయిల్‌ నిరాకరించడం సమంజసం కాదని ధర్మాసనం అభిప్రాయపడింది.  వెర్నాన్ గోన్సాల్వేస్, అరుణ్ ఫెరీరాల తరపున న్యాయవాదులు మూడు రోజుల పాటు వాదనలు వినిపించారు. ఊపా చట్టం కింద అరెస్టు చేయడానికి సరిపడు ఆధారాలు తమ క్లయింట్ల వద్ద లభించలేదని విన‍్నివించారు. అందుకు తగు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకోలేదని స్పష్టం చేశారు. 

పూణెలోని బీమా కొరేగావ్‌ యుద్ధ స‍్మారకం వద్ద 2017 డిసెంబర్‌లో  హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ కేసులో వెర్నాన్ గోన్సాల్వేస్, అరుణ్ ఫెరీరాలతో సహా 14 మందిని ఎన్‌ఐఏ నిందితులుగా చేర‍్చింది. బీమా కొరేగావ్‌ యుద్ధం జరిగి 200 ఏళ్ల వార్షికోత్సవాన్ని 2017 డిసెంబర్ 31న  జరిపారు.  

దీనిని పురస్కరించుకుని ఎల్గార్ పరిషత్ ఈవెంట్‌కు సంబంధించి మావోయిస్టులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ముంబయి, నాగ్‌పూర్, ఢిల్లీ నుంచి 2018 జూన్‌లో  ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఎల్గార్ పరిషత్ కార్యక్రమంలో రెచ్చగొట్టే ప్రసంగాలు హింసను ప్రేరేపించాయని విశ్రాంబాగ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. 

ఇదీ చదవండి: కావాలనే లీక్‌ చేశారు.. మణిపూర్‌ నగ్న ఊరేగింపు ఘటనపై హోం మంత్రి వ్యాఖ్యలు

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)