Breaking News

స్వాతి మలివాల్‌పై దాడి కేసు: బిభవ్‌ కుమార్‌పై సుప్రీం ఆగ్రహం

Published on Thu, 08/01/2024 - 13:59

ఢిల్లీ:  రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్‌పై దాడి  చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సహాయకుడు బిభవ్‌ కుమార్‌ దాఖలుచేసిన పటిషన్‌పై సుప్రీం కోర్టు గురువారం  విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా బీభవ్‌ కుమార్‌పైనే సుప్రీం కోర్టు ధర్మాసనం మండిపడింది. ఈ ఘటన దిగ్భ్రాంతి కలిగించిందని,  నివాసంలోకి ప్రవేశించిన ఓ గూండా స్వాతి మలివాల్‌పై దాడి చేసినట్లు అనిపించిందని కోర్టు పేర్కొంది. ఈ కేసులో బిభవ్‌ కుమార్‌ దాఖలు చేసిన  బెయిల్‌ పిటిషన్‌ ఢిల్లీలోని మెజిస్టీరియల్ కోర్టు కొట్టివేసింది. అయితే మెజిస్టీరియల్ కోర్టు  తీర్పును సవాల్‌ చేస్తూ.. బిభవ్‌ కుమార్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.​ ఆయన దాఖలుచేసిన బెయిల్‌ పిటిషన్‌పై న్యాయమూర్తులు సూర్యకాంత్, దీపాంకర్ దత్తా, ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది.

‘ముఖ్యమంత్రి బంగ్లా ఏమైనా వ్యక్తిగత నివాసమా? సీఎం కార్యాలయం అటువంటి గూండాలను ఉంచుకోవటం అవసరమా? ఇది సరైనా పద్దతేనా? మేము చాలా ఆశ్చర్యపోయాం. అసలు ఇది ఎలా జరిగింది’అని ధర్మాసనం ప్రశ్నించింది. ‘బిభవ్‌ కుమార్‌ అసలు ఏమనుకుంటున్నాడు? అతని ఏం అధికారం ఉంది? ఒక గూండాలా అతన్ని తయారు చేశారు. ఓ యువతి అయిన స్వాతి మలివాల్‌పై దాడి చేయడానికి బిభవ్ కుమార్‌కు సిగ్గు ఉండాలి?’ కోర్డు అసహనం వ్యక్తం చేసింది. 

స్వాతి మలివాల్‌ తన ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పినా ఆమెపై దాడి చేశారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. కేసు పరిశీలన కోసం ఛార్జిషీట్‌ను తమ ముందు ఉంచాలని చెప్పి సుప్రీంకోర్టు విచారణను ఆగస్టు 7కు వాయిదా వేసింది. సీఎం కేజ్రీవాల్‌ నివాసంలో బిభవ్‌కుమార్‌ తనపై దాడి చేశారని స్వాతి మలివాల్ మే 13న ఆరోపణలు చేశారు.  మే 16  ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా బిభవ్‌కుమార్‌పై ఎఫ్ఐఆర్‌ నమోదు అయింది. 
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)