Breaking News

సీఈసీని అభిశంసించాలి

Published on Wed, 02/04/2026 - 04:47

న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్‌(సీఈసీ) జ్ఞానేశ్‌ కుమార్‌ను అభిశంసించాలని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ అన్నారు. ఆయనపై అభిశంసనకు తీర్మానం ప్రవేశపెడితే తాము కచి్చతంగా మద్దతిస్తామని ప్రకటించారు. ఈ విషయంలో ఇతర విపక్ష పారీ్టలు సైతం ముందుకు రావాలని కోరారు. ఆమె మంగళవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. 

బెంగాల్‌లో తమ పార్టీ మద్దతుదారుల ఓట్లను ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) ముసుగులో తొలగిస్తున్నారని ఆరోపించారు. ఓటర్ల జాబితాలో అక్రమాలకు సీఈసీని జబాబుదారీ చేస్తూ చట్టం తీసుకురావాలంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ  చేసిన సూచనను మమతా బెనర్జీ గట్టిగా సమర్థించారు. ఇప్పుడు ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయి కాబట్టి సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ను అభిశంసించాలని తేల్చిచెప్పారు. ఈ దిశగా కాంగ్రెస్‌ ముందడుగు వేస్తే మద్దతిస్తామని అన్నారు. 

ఓట్లు తొలగిస్తే బాధితులు ఎక్కడికెళ్లాలి?  
బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామన మమతా బెనర్జీ తేల్చిచెప్పారు. ఎన్నికల సంఘాన్ని వాడుకోకుండా తమతో ముఖాముఖి తలపడాలని బీజేపీకి సవాలు విసిరారు. బెంగాల్‌లో ఎస్‌ఐఆర్‌ వల్ల దళితులు, గిరిజనులు, మైనారీ్టలు, అణగారినవర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతోందని, వారి ఓట్లు రద్దవుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఎస్‌ఐఆర్‌తో తొలగింపునకు గురైన ఓట్లు వందశాతం తృణమూల్‌ కాంగ్రెస్‌ మద్దతుదారులవేనని చెప్పారు. బీజేపీపై అనుమానం రాకుండా ఒకటి రెండు ఓట్లు ఇతర పారీ్టల మద్దతుదారులవి కూడా తొలగించి ఉండొచ్చని వ్యాఖ్యానించారు. ఓట్లు తొలగిస్తే వారంతా ఎక్కడికి వెళ్లాలి? అని ప్రశ్నించారు. 

నేడు సుప్రీంకోర్టులో విచారణకు మమత హాజరు! 
బెంగాల్‌లో ఎస్‌ఐఆర్‌ చేపట్టడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టనుంది. ఈ విచారణకు బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)