Breaking News

ఎట్టకేలకు గొన్సాల్వేజ్, ఫెరీరా విడుదల

Published on Sun, 08/06/2023 - 06:12

ముంబై: ఎల్గార్‌ పరిషత్‌–మావోయిస్టులతో సంబంధాల కేసులో అరెస్టయి విచారణ ఖైదీగా సంవత్సరాల తరబడి జైలు జీవితం గడిపిన సామాజిక కార్యకర్తలు వెర్నాన్‌ గొన్సాల్వేజ్, అరుణ్‌ ఫెరీరాలు ఎట్టకేలకు జైలు నుంచి బెయిలుపై బయటికొచ్చారు. గత వారం వారికి బెయిల్‌ ఇస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పునివ్వడం తెల్సిందే. శనివారం ప్రత్యేక కోర్టు సంబంధిత విడుదల పత్రాలను నవీ ముంబైలోని తలోజ కారాగారం అధికారులకు పంపడంతో వారం తర్వాత ఎట్టకేలకు వారు బయటికొచ్చారు.

జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) దర్యాప్తు చేస్తూ ప్రత్యేక కోర్టు పరిశీలనలో ఉన్న ఈ కేసుకు సంబంధించి ఇప్పటిదాకా 16 మంది అరెస్టయ్యారు. గొన్సాల్వేజ్, అరుణ్‌తో కలిపి ఇప్పటిదాకా ఐదుగురు బెయిల్‌పై బయటికొచ్చారు. ఒక్కో నిందితుడు ఒక మొబైల్‌ వాడుకోవచ్చని, వారు ఉండే అడ్రస్‌ ఎన్‌ఐఏకు ఇవ్వాలని, సంబంధిత నిబంధనలు ఉల్లంఘిస్తే బెయిల్‌ రద్దు అవుతుందని ధర్మాసనం స్పష్టంచేసింది. విద్యావేత్త, కార్యకర్త ఆనంద్‌ తేల్‌తుంబ్డే, న్యాయవాది సుధా భరద్వాజ్‌లకు గతంలో సాధారణ బెయిల్‌ రాగా, అనారోగ్య కారణాలతో విప్లవ కవి వరవరరావు బెయిల్‌ సాధించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో జైలు నుంచి బయటికొచ్చిన కార్యకర్త గౌతమ్‌ నవ్‌లఖా ప్రస్తుతం గృహనిర్బంధంలో ఉన్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు