Breaking News

స్వాతి మలివాల్‌పై దాడి కేసు: బిభవ్‌ కుమార్‌కు బెయిల్‌

Published on Mon, 09/02/2024 - 17:03

ఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ( ఆప్‌) ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో అరెస్టైన సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పీఏ బిభవ్‌ కుమార్‌కు సుప్రీం కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఎంపీపై దాడి కేసులో బెయిల్‌, అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ బిభవ్‌కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్‌ సూర్య కాంత్‌, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ కేసులో నిందితుడు బిభవ్‌ కుమార్‌ జ్యుడీషియల్‌ కస్టడీలో 100 రోజులు ఉన్నారని, ఛార్జ్‌షీట్‌ నమోదైనట్లు సుప్రీం కోర్టు తెలిపింది. 

‘స్వాతి మలివాల్‌కు గాయాలు అయ్యాయి. కానీ ఈ కేసులో బెయిల్‌ ఇవ్వడాన్ని అడ్డుకోలేం. బెయిల్‌ నిరాకరిస్తూ జైలులోనే ఉంచేలా చేయలేం’ అని న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్ భుయాన్‌ అన్నారు. ఢిల్లీ పోలీసుల తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. ఈ కేసులో కొందరు ముఖ్యమైన సాక్షులపై నిందితుడు బిభవ్ కుమార్‌ ప్రభావం ఉంది. వారిని విచారించడానికి అనుమతి ఇవ్వండి. అప్పుడు తాము బెయిల్‌ను వ్యతిరేకించమని కోర్టుకు తెలిపారు. 

అలా అయితే.. సొలిసిటర్‌ జనరల్‌ చెప్పిన విధంగా తాము ఎవరికీ బెయిల్ మంజూరు చేయలేమని జస్టిస్ భుయాన్ అన్నారు. బెయిల్‌ మంజూరు చేయకుండా ఉంచటం ఆందోళన కలిగించే విషయమని సుప్రీకోర్టు పేర్కొంది. ఈ దాడి కేసులో సాక్షులందరినీ విచారించే వరకు నిందితుడు బిభవ్‌ కుమార్‌ ఢిల్లీ ముఖ్యమంత్రి  అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసంలోకి ప్రవేశించవద్దని సుప్రీం కోర్టు షరుతు విధించింది.

మే 13న స్వాతి మలివాల్‌పై బిభవ్‌ కుమార్ తనపై దాడి చేసినట్లు ఆరోపించిన విష​యం తెలిసిందే. ఈ ఘటన ఢిల్లీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ.. సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. స్వాతి మలివాల్‌ ఫిర్యాదు మేరకు బిభవ్‌ కుమార్‌పై పోలీసులు మే 18న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)