Breaking News

‘మీరు మోసగాళ్ల తరఫు లాయర్లు కదా!’

Published on Fri, 10/10/2025 - 13:45

సాక్షి, ఢిల్లీ: అక్రమ మద్యం కేసులో వైఎస్సార్‌సీపీ నేత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి శుక్ర‌వారం ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది సుప్రీం కోర్టు. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఏపీ ప్రభుత్వం తరఫున వాదించిన లాయర్లకు జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ సరదాగా ఓ చురక అంటించారు.  

ఏపీలో మద్యం కుంభకోణం జరిగిందని ప్రముఖ బ్రాండ్లను తొలగించి కొత్త బ్రాండ్లను తీసుకొచ్చారని ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి (Mukul Rohatgi) వాదించారు. అయితే.. ఎంఎస్ఎంఈ తరహాలో వాటిని ప్రోత్సహించారామో? అని ఈ సందర్భంగా ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. అక్కడితో ఆగకుండా.. 

‘‘మీరు బెయిల్‌కు వ్యతిరేకంగా వాదిస్తున్నారా? మీరు దేశంలోని మోసగాళ్లు అంద‌రి తరఫున వాదనలు వినిపించే న్యాయవాదులు... పెద్ద పెద్ద స్కాంలలో నిందితుల తరఫున వాదనలు వినిపించారు... ఇప్పుడు మీరు బెయిల్‌కు వ్యతిరేకంగా?" అని జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ ఫ్రెండ్లీగా అనడంతో కోర్టు హాల్‌లో నవ్వులు పూశాయి.

ఇదిలా ఉంటే ఈ కేసులో ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి, సిద్ధార్థ లూత్రా, సిద్దార్థ్ అగర్వాల్‌లు వాదనలు వినిపించారు. ఈ ముగ్గురిలో ముకుల్‌ రోహత్గీ, సిద్ధార్థ్‌ లూథ్రాలు గతంలో ఎన్నో హైప్రొఫైల్‌ కేసుల్లో బెయిల్‌ కోసం వాదనలు వినిపించారు. ఇందులో గుజరాత్‌ అల్లర్ల కేసు, జస్టిస్‌ లోయా కేసు(అమిత్‌ షా తరఫున), ఆశారాం బాపు కేసు, కోల్‌స్కాం, 2జీ కుంభకోణం కేసులు, అలాగే.. నోట్ల కట్టల జస్టిస్‌ వర్మ కేసులు ఉన్నాయి. వీటితో పాటు చంద్రబాబు నాయుడు నిందితుడిగా ఉన్న ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసు కూడా ఉంది. 

ఇదీ చదవండి: విశాఖ సీపీపై వైఎస్సార్‌సీపీ ఫైర్‌

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)