Breaking News

SBI: మొత్తం 22,217 ఎన్నికల బాండ్లు జారీ

Published on Wed, 03/13/2024 - 13:27

ఢిల్లీ: ఎన్నికల బాండ్ల కేసులో సుప్రీం కోర్టు ఆగ్రహానికి గురైన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. ఎట్టకేలకు ఆ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది. మంగళవారం సాయంత్రమే కోర్టు ఆదేశాల మేరకు వివరాలు ఇవ్వగా.. ఇవాళ సమ్మతి అఫిడవిట్(compliance affidavit) సమర్పించింది. అందులో.. 

ఈసీకి ఇచ్చిన పెన్‌ డ్రైవ్‌ వివరాలను అఫిడవిట్‌లో ప్రస్తావించింది.  పెన్‌డ్రైవ్‌లో రెండు పీడీఎఫ్‌ ఫైల్స్‌ ఉన్నాయని.. వాటికి పాస్‌వర్డ్‌ ఉన్నాయని పేర్కొంది. అలాగే.. ఏప్రిల్‌ 2019 నుంచి.. ఈ ఏడాది 2024 ఫిబ్రవరి 15వ తేదీ దాకా(అంటే.. ఎన్నికల బాండ్లు చెల్లవని కోర్టు తీర్పు ఇచ్చేదాకా ) మొత్తం 22, 217 ఎన్నికల బాండ్లను జారీ చేసినట్లు ఎస్‌బీఐ పేర్కొంది. 

ఈ మొత్తంలో రాజకీయ పార్టీలు 22, 030 బాండ్లను తీసుకున్నాయని తెలిపింది. అలాగే.. మిగిలిన 187 తాలుకా బాండ్ల నగదు ప్రధాని రిలీఫ్‌ ఫండ్‌కు జమ అయినట్లు ఎస్‌బీఐ పేర్కొంది.

ఎన్నికల బాండ్ల పథకం కింద.. దాతలు తమ ఇష్టపూర్వకంగా విరాళాలను ఎస్‌బీఐ నుంచి ఎన్నికల బాండ్ల రూపేణా కొనుగోలు చేసి ఆయా పార్టీలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ.. 15 రోజుల్లో గనుక పార్టీలు ఆ బాండ్లను స్వీకరించకపోతే ఆ డబ్బు ప్రధాని రిలీఫ్‌ ఫండ్‌కు వెళ్తుంది. కానీ, ఈ పథకం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ రద్దు చేస్తూ ఫిబ్రవరి 15వ తేదీన సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.

ఇదీ చదవండి: 26 రోజులేం చేశారు?.. ఎస్‌బీఐపై సుప్రీం కన్నెర్ర

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)