Breaking News

యాచకులను నియంత్రించండి.. పాక్‌కు సౌదీ హెచ్చరిక

Published on Wed, 09/25/2024 - 07:58

ఇస్లామాబాద్: పాక్‌లోని యాచకులు తమ పొట్టపోసుకునేందుకు సౌదీ అరబ్‌కు తరలివెళ్లడం గల్ఫ్‌ దేశానికి భారంగా మారింది. ఉమ్రా, హజ్ పేరుతో తమ దేశానికి వస్తున్న పాకిస్తానీ యాచకుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంపై సౌదీ అరేబియా ఆందోళన వ్యక్తం చేస్తోంది.

పాక్‌లోని యాచకులు గల్ఫ్ దేశంలోకి ప్రవేశించకుండా తగిన చర్యలు తీసుకోవాలని తాజాగా పాకిస్తాన్‌ను సౌదీ అరేబియా హెచ్చరించింది. పాకిస్తాన్ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన సమాచారాన్ని ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ ప్రచురించింది. పాక్‌కు చెందిన యాచకులు గల్ఫ్‌కు తరలివెళ్లడాన్ని నియంత్రించాలని పాకిస్తాన్‌ను సౌదీ అరేబియా కోరింది. అక్కడి యాచకులు తమ దేశానికి రావడంతో ఉమ్రా, హజ్ యాత్రికులపై ప్రతికూల ప్రభావం పడుతున్నదని ఆరోపించింది.

ఉమ్రా వీసాతో పాకిస్తానీ యాచకులు గల్ఫ్ దేశంలోకి ప్రవేశించకుండా ఆ దేశం చర్యలు తీసుకోవాలని సౌదీ హజ్ మంత్రిత్వ శాఖ పాకిస్తాన్ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపధ్యంలో ఉమ్రాను ఏర్పాటు చేసే ట్రావెల్ ఏజెన్సీలను నియంత్రించడం, వాటిని చట్టపరమైన పర్యవేక్షణలోకి తీసుకువచ్చేందుకు ఉమ్రా చట్టం తీసుకురావాలని పాకిస్తాన్‌ నిర్ణయించింది.

దీనికిముందు సౌదీ రాయబారి నవాఫ్ బిన్ సయీద్ అహ్మద్ అల్-మాలికీతో సమావేశమైన పాక్‌ మంత్రి మొహ్సిన్ నఖ్వీ.. సౌదీ అరేబియాకు యాచకులను పంపే మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉమ్రా పేరుతో పాకిస్తానీ యాచకులు గల్ఫ్ దేశానికి వెళుతున్నారని, అక్కడ భిక్షాటన సాగిస్తున్నారని సౌదీ అరేబియా తరచూ ఆరోపిస్తోంది.

ఇది కూడా చదవండి: విదేశీయుల చూపు..ఏపీ సేంద్రియ సాగు వైపు

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)