Breaking News

ఈ జీవితం చాలు.. ప్రియుడికి మెసేజ్‌ పంపి యువతి ఆత్మహత్య

Published on Wed, 07/08/2026 - 11:41

బెంగళూరు: చదువుకోవాల్సిన వయసులో ప్రేమ పాశానికి గురైన యువతి బతుకును చిదిమేసుకుంది. బెంగళూరు శాంకీ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. చిక్కబాణవార నివాసి పి.తేజస్విని రాజ్‌ (20) గా సదాశివనగర పోలీసులు గుర్తించారు. వివరాలు.. తేజస్విని  చిక్కబాణవారలోని ప్రైవేటు కాలేజీలో డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. సోమవారం మధ్యాహ్నం కాలేజీ నుంచి శాంకీ చెరువు వద్దకు వెళ్లి ఆత్మహత్య చేసుకుంటున్నానని ప్రియునికి మెసేజ్‌ చేసింది.

 అతను తేజస్విని తల్లికి విషయం చెప్పాడు. ఆమె సదాశివనగర పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు, కుటుంబసభ్యులు చెరువు వద్దకు వచ్చి అర్ధరాత్రి వరకు గాలించారు. మంగళవారం ఉదయం చెరువులో తేజస్విని మృతదేహం బయటపడింది. సీసీ కెమెరాల దృశ్యాలు ఆధారంగా సోమవారం సాయంత్రం 4 నుంచి 6 గంటలవరకు చెరువు ఆవరణలో తిరిగిన తేజస్విని రాత్రి చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది.    

ఈ జీవితం చాలు...   
తన ప్రియునికి.. తన జీవితం చాలు,  నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని  మెసేజ్‌ పంపించి మొబైల్‌ స్విచ్చాఫ్‌ చేసినట్లు వెల్లడైంది. ప్రేమ గొడవే కారణమని దర్యాప్తులో వెలుగుచూసింది. ఆమె కాలేజీలో యువకున్ని ప్రేమించింది,  తల్లిదండ్రులు.. నీది ఇంకా చిన్న వయసు, ప్రేమించడానికి సమయం ఉంది. మొదట చదువుకోవాలని మందలించారు. కొన్నాళ్లనుంచి ప్రేమికులు దూరంగా ఉన్నారు. ఈ ఆవేదనతోనే చెరువులోకి దూకి చనిపోయిందని తేలింది.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)