Breaking News

ఠాక్రేలు తలుచుకుంటే ముంబై పరిస్థితి అదే?: సంజయ్ రౌత్

Published on Sun, 01/11/2026 - 19:53

బృహత్ ముంబై కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ శివసేన (ఠాక్రే) ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబైలో ఠాక్రే కుటుంబానికి ఎదురులేదన్నారు. ప్రస్తుతం మరాఠీల గౌరవం కోసమే ఠాక్రే సోదరిలిద్దరూ కలిసి ప్రచారానికి వచ్చారన్నారు. మహానగరంలో శివసేన పట్టు ఇప్పటికీ సడలేదని ఠాక్రేలు తలుచుకుంటే 10 నిమిషాల్లో ముంబైనగరం మూసివేయగలరని సంచలన వ్యాఖ్యలు చేశారు.

గతేడాది మహారాష్ట్ర రాజకీయాలలో కీలక పరిమాణం చోటుచేసుకుంది. కుటుంబ విభేదాలతో విడిపోయిన ఉద్దవ్ ఠాక్రే, రాజ్‌ ఠాక్రేలిద్దరూ  20 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత తిరిగి కలిశారు. అనంతరం ముంబై మహానగర పాలక సంస్థకు జరిగే ఎన్నికల్లో శివసేన (ఠాక్రే), మహారాష్ట్ర నవనిర్మాణ సేన రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా టర్న్ తీసుకున్నాయి.

ఈ నేపథ్యంలో ఎంపీ సంజయ్‌ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. "ముంబై నగరంలో ఠాక్రేలు ఎప్పుడు ఓడిపోలేదు. వారు తలుచుకుంటే ముంబైని 10 నిమిషాల్లో స్తంబింపచేయగలరు. ఉద్దవ్ ఠాక్రే, రాజ్‌ ఠాక్రేలిద్దరూ అన్నదమ్ములూ వారు మళ్లీ కలవడం అదృష్టం" అన్నారు. వారిద్దరి మధ్య విబేధాలున్నప్పటికీ దేశం కోసం ఏకమయ్యారని తెలిపారు.

"ఠాక్రేలు అంటే ఒక బ్రాండ్ వారు ఉంటేనే మరాఠాల గౌరవం బ్రతికుంటుంది. ఉద్దవ్, రాజే ఒకరే, మేయర్ మనవారే" అని రౌత్ అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తోసిపుచ్చారు. "ఒకవేళ బాల్‌ఠాక్రే బతికి ఉంటే ఇది సాధ్యమయ్యేది.కానీ వీరివల్ల కాదు ఏక్ నాథ్ శిండేని ముంబైలో అడుగుపెట్టనివ్వమన్నారు. కానీ 50మంది ఎమ్మెల్యేలతో కలిసి ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేశారు" అని ఠాక్రే సోదరులను ఫడ్నవీస్ దుయ్యబట్టారు.

 

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)