Breaking News

నాడు సీమా, నేడు సానియా.. ‍ప్రేమ కోసం తరలివస్తున్న ప్రియురాళ్లు!

Published on Tue, 08/22/2023 - 06:59

ప్రేమ కోసం దేశ సరిహద్దులను లెక్కచేయకుండా పాకిస్తాన్‌ నుంచి భారత్‌కు తరలివచ్చిన సీమా హైదర్‌ కథ మరచిపోకముందే అలాంటి అనేక ప్రేమ కథలు మన ముందుకు వస్తున్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌కు చెందిన ఒక మహిళ తన ఏడాది కుమారునితో పాటు భారత్‌కు తరలివచ్చింది. ఆమె తన పేరు సానియా అఖ్తర్‌ అని చెబుతోంది.

సానియా బంగ్లాదేశ్‌నుంచి వీసా తీసుకుని, తన భర్త సౌరభ్‌ కాంత్‌ తివారిని కలుసుకునేందుకు వచ్చింది. సానియా, సౌరభ్‌లు మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నారని సమాచారం. తరువాత వారికి ఒక కుమారుడు జన్మించాడు. ఆ చిన్నారికి ఇప్పుడు ఏడాది వయసు. సానియా ఇప్పుడు కుమారుడిని తీసుకుని, తన భర్త ఉంటున్న నోయిడాకు వచ్చింది. అయితే ఆమె ఇక్కడకు వచ్చాక భర్త మరో వివాహం చేసుకున్నాడని ఆమెకు తెలిసింది.  

సానియా మీడియాతో మాట్లాడుతూ తన భర్త సౌరభ్‌ తనకు ఇప్పుడు ఆశ్రయం కల్పించడం లేదని, తనను మోసం చేసిన సౌరభ్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ విడిచిపెట్టేది లేదని తెలిపింది. కాగా ఈ ఉదంతం నోయిడా పోలీసుల వరకూ చేరింది. ఆమె తన కుమారుడిని తీసుకుని సెక్టార్‌ 108లో ఉన్న పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయానికి చేరుకుంది. తనకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను వేడుకుంది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం సౌరభ్‌ బంగ్లాదేశ్‌లోని ఢాకాలో కల్టీ మ్యాక్స్‌ ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో పనిచేసేవాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 
ఇది  కూడా చదవండి: అప్పడం ఘన చరిత్ర: పాక్‌లో పుట్టి, విభజన సమయంలో ఉపాధిగా మారి..

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)