Breaking News

'సందేశ్‌ఖాలీ' కేసులో సుప్రీంకోర్టుకు దీదీ సర్కార్‌

Published on Tue, 03/05/2024 - 19:54

సందేశ్‌ఖాలీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులపై జరిగిన దాడికి సంబంధించిన కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించేందుకు బెంగాల్‌ ప్రభుత్వం విముఖత చూపింది. ఇవాళ సాయంత్రం లోపు కేసును సీబీఐకి అప్పగించాలని ఆ రాష్ట్ర హైకోర్డు డెడ్‌లైన్‌ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆదేశాలను సుప్రీం కోర్టులో సవాల్‌ చేస్తూ పిటిషన్‌ వేసింది బెంగాల్‌ ప్రభుత్వం. 

బెంగాల్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీ, జైదీప్ గుప్తా, గోపాల్ శంకరనారాయణన్ ఈరోజు జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన ధర్మాసనం ముందు సుప్రీంకోర్టు జోక్యం కోరుతూ చేసిన పిటిషన్‌ వేశారు. అయితే ఆ పత్రాలను భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ముందు ఉంచాలని పిటిషనర్‌కు సూచించింది బెంచ్‌.

రేషన్ బియ్యానికి సంబంధించిన కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న షాజహాన్‌ షేక్‌ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడానికి వెళ్లిన సమయంలో, అతని అనుచరులు అధికారులపై దాడిచేశారు. ఈ ఘటన జరిగిన తరువాత షాజహాన్‌ పరారయ్యాడు. మరోవైపు షాజహాన్‌ దురాగతాలపై అప్పుడే వెలుగులోకి సంచలన విషయాలు వచ్చాయి. తమపై అత్యచారాలు జరుగుతున్నాయంటూ సందేశ్‌ఖాలీ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.

సుమారు 50 రోజులకు పైగా పరారీలో ఉన్న షాజహాన్‌ను పోలీసులు ఫిబ్రవరి 29న అరెస్ట్ చేశారు. అయితే నిందితుడు సామాన్యుడు కాదని.. ప్రజాప్రతినిధి అని.. దర్యాప్తు అనేది సాధారణ ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడటానికే తప్ప కేసుకు సంబంధించిన నిజాలను దాచి పెట్టడానికి కాదని చెబుతూ.. సిట్‌ ఏర్పాటును సైతం రద్దు చేసి కేసును సీబీఐకి అప్పగించాలని కలకత్తా హైకోర్టు బెంగాల్‌ పోలీస్‌ శాఖను ఆదేశించింది. 

Videos

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)