Breaking News

నరకం చూశా.. సిద్దరామయ్య గారు క్షమించండి: ఎంపీ ఆవేదన

Published on Mon, 12/01/2025 - 10:15

బెంగళూరు: ఇటీవలి కాలంలో బెంగళూరు ట్రాఫిక్‌పై పలువురు ప్రముఖులు తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ సైతం బెంగళూరులో ట్రాఫిక్‌ విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రద్దీ నియంత్రణ కోసం పోలీసులకు తాను ఫోన్‌ చేసినా స్పందించలేదని మండిపడ్డారు.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎస్పీ ఎంపీ రాజీవ్ రాయ్ బెంగళూరుకు వెళ్లారు. అనంతరం, పార్లమెంట్‌ సమావేశాలకు హాజరు కావాల్సి ఉండగా ఆయన ఎయిర్‌పోర్టుకు బయలుదేరారు. ఇంతలో బెంగళూరు రోడ్లపై ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ జామ్‌ ఉంది. దీంతో, తాను వెళ్లాల్సిన విమానం మిస్‌ అవుతుందనే కారణంగా స్థానిక పోలీసులకు సంప్రదించేందుకు ప్రయత్నించారు. వెంటనే పోలీసులకు ఫోన్‌ చేశారు. అయితే, తన కాల్‌ను పోలీసులు లిఫ్ట్‌ చేయకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు.

ఈ సందర్బంగా సోషల్‌ మీడియా వేదికగా రాజీవ్‌ రాయ్‌ స్పందిస్తూ.. బెంగళూరులో ట్రాఫిక్‌ కారణంగా రోడ్లపై నరకం చూడాల్సి వచ్చింది. గౌరవనీయులైన కర్ణాటక ముఖ్యమంత్రి, నన్ను క్షమించండి. బెంగళూరులో ట్రాఫిక్‌ నిర్వహణ దారుణంగా ఉంది. అత్యంత బాధ్యతారహితమైన, పనికిరాని ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు. వారు ఫోన్ కాల్స్ కూడా తీసుకోరు. వారితో మాట్లాడటానికి ఎంత ప్రయత్నించినా సఫలం కాలేదు. ఎవరూ నా కాల్‌ను తీసుకోలేదు. రాజ్‌కుమార్ ఘాట్‌ రోడ్డులో ఒక గంట పాటు ఒకే చోట ట్రాఫిక్‌లో ఉండిపోయాను. ఒకానొక సమయంలో నేను ఢిల్లీ వెళ్లాల్సిన విమానం మిస్‌ అవుతుందో అని టెన్షన్‌ పడ్డాను. రోడ్లపై ఒక్క పోలీసు కూడా కనిపించలేదు. ఈ అసమర్థ అధికారులే బెంగళూరు నగరం పేరును చెడగొడుతున్నారు. ఇప్పుడు బెంగళూరు ట్రాఫిక్ అత్యంత అపఖ్యాతిని పొందింది అనడంలో సందేహం లేదు’ అని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)