Breaking News

పోరాటాన్ని హైజాక్‌ చేయకండి.. నీట్‌ నిరసనలపై సల్మాన్‌ ఖాన్‌ పోస్ట్‌!

Published on Thu, 07/23/2026 - 01:10

సాక్షి, ఢిల్లీ:  రాజధాని ఢిల్లీలో జరుగుతున్న పేపర్‌ లీక్‌ ఆందోళనలపై బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ స్పందించారు. నీట్‌ పేపర్‌ లీక్‌ నిరసనలకు తన పూర్తి మద్దతును ప్రకటించారు. ఈ ఆందోళనలో పాల్గొంటున్న విద్యార్థుల పోరాటం స్ఫూర్తిధాయకం అని  అభినందించారు. అదే సమయంలో ఈ వివాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని ఈ ఉద్యమాన్ని  "హైజాక్" చేయవద్దని పరోక్షంగా విపక్షాలకు చురకలంటించారు.

ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద  నీట్‌ పేపర్‌ లీకేజ్‌పై సీజేపీ నేతృత్వంలో నిరసనలు జరుగుతున్న తీవ్ర ఉద్రిక్తకరంగా మారాయి. ఈ నేపథ్యంలో సీజేపీ నిరసనలకు దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. తాజాగా సినీస్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ సైతం విద్యార్థులకు తన మద్ధతును ప్రకటించారు.  ఈ నేపథ్యంలో ఇన్‌స్టా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.

సల్మాన్‌ తన పోస్ట్‌లో " ఈ సమస్య విద్యార్థులకు, విద్యా వ్యవస్థకు మధ్య ఉన్నది, దీనిని రాజకీయంగా హైజాక్ చేయకూడదు, దీని ఘనత మన దేశ విద్యార్థులకే దక్కాలి, ప్రభుత్వం కూడా వారికి పూర్తి మద్దతు ఇచ్చి విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఇది ఇరుపక్షాలకూ లాభదాయకమైన పరిస్థితి. సానుకూల నిర్ణయం కోసం ఆశిస్తూ ప్రార్థిస్తున్నాను. చదువుకోవాలనుకునే మీ అందరినీ దేవుడు ఆశీర్వదించుగాక," అని ఆయన రాశారు.

ఈ సందర్భంగా తన చిన్ననాటి ఫోటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. దేశంలో విద్య ఒక 'ఫ్యాషన్ ట్రెండ్'గా మారితే, విదేశాల నుంచి విద్యార్థులు భారత్‌కు చదువుకోవడానికి వస్తారని తెలిపారు. కాగా నీట్‌ నిరసనలకు ఇదివరకే బాలీవుడ్ ప్రముఖులు  ఓమీ వైద్య, జీనత్ అమన్, నసీరుద్దీన్ షా, రత్న పాఠక్ షా, అభయ్ డియోల్, సోనాక్షి సిన్హా, రితేష్ దేశ్‌ముఖ్ వంటి ప్రముఖులు మద్దతు ప్రకటించారు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)