Breaking News

శబరిమల బంగారం చోరీ కేసులో కీలక పరిణామం

Published on Tue, 01/20/2026 - 09:04

తిరువనంతపురం: శబరిమల బంగారం చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేరళ, కర్ణాటక, తమిళాడులో ఈడీ అధికారులు దాడులు చేశారు. దేవస్యం బోర్డు మాజీ సభ్యుడి ఇంట్లో ఈడీ తనిఖీలు నిర్వహించారు. 

శబరిమల బంగారు దొంగతనం కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆలయంలోని గర్భగుడి వెలుపల ఉన్న బంగారు పూత పలకలు అపహరణకు గురయ్యాయి.  ఈ కేసులో ఇప్పటికే కేరళ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేసింది. సిట్‌ అధికారుల దర్యాప్తులో నిందితులు బంగారు పలకలను తొలగించి, వాటిని అక్రమంగా విక్రయించినట్లు తేలింది. ఆర్థిక లావాదేవీలలో అనుమానాస్పద అంశాలు బయటపడటంతో మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు రంగంలోకి దిగారు.  

మంగళవారం ఉదయం నుంచి కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని 21 ప్రదేశాల్లో ఏకకాలంలో దాడులు చేశారు. నిందితుల నివాసాలు, వ్యాపార సంస్థలు, అలాగే సంబంధిత ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ దాడుల్లో ఈడీ అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో నిందితులు పలు ఆర్థిక మోసాలకు పాల్పడ్డారనే ఆధారాలు బయటపడ్డాయి.

శబరిమల బంగారం చోరీ కేసులో కొల్లం విజిలెన్స్ కోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. బంగారం చోరీ కేసులో సిట్‌ దర్యాప్తు పత్రాలను ఈడీకి అందించాలని సూచించింది. దీంతో రెండు సంస్థలు కలిసి దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. సిట్‌ ఇప్పటికే నిందితులను గుర్తించి కేసు నమోదు చేసింది. ఈడీ కూడా అదే నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తోంది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)