Breaking News

22 ఏళ్ల తర్వాత పగ తీర్చుకున్న వ్యక్తి.. తండ్రిని చంపినట్లే..

Published on Fri, 10/04/2024 - 18:01

ఓ వ్యక్తి తన పగను తీర్చుకున్నాడు. అయితే ఒకటి రెండేళ్లకు కాదు ఏకంగా 22 ఏళ్ల తర్వాత తన తండ్రిని చంపిన హంతకుడిని మట్టుబెట్టాడు. ఒకప్పుడు తన తండ్రిని ఎలా చంపాడే సదరు వ్యక్తిని కూడా అలాగే చంపేశాడు. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగింది.

పోలీసుల వివరాల  ప్రకారం.. అక్టోబర్ 1న అహ్మదాబాద్‌ నఖత్ సింగ్ భాటి(50) అనే వ్యక్తి సైకిల్‌పై వెళ్తుండగా కారు ఢీకొనడంతో మరణించినట్లు సమాచారం అందింది. నఖత్ సింగ్ భాటీ అహ్మదాబాద్‌లో థాల్తేజ్ లోని ఓ కాలేనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ముందుగా ఇది ‍ప్రమాదంగా భావించిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా హత్యకు గురైనట్లు తేలింది.

నిందితుడు గోపాల​ సింగ్‌ భాటి ఉద్దేశపూర్వకంగానే నఖత్‌ను గుద్ది పారిపోయేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. 2002లో రాజస్థాన్‌లో 22 ఏళ్ల క్రితం తన తండ్రి కూడా ఇదే విధంగా నఖత్ హత్య చేసినట్లు పోలీసులకు వెల్లడించాడు. అందుకే ఇప్పుడు అతన్ని చంపి పగ తీర్చుకున్నట్లు తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి విచారణ జరుపుతున్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)