Breaking News

కాశీలో హిందువుగా మారిన రష్యన్‌ మహిళ

Published on Sun, 02/11/2024 - 11:15

విశ్వనాథుడు కొలువైన కాశీ నగరం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకమైనది. దేశ విదేశాల నుంచి మహాశివుని భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. ఇదే కోవలో నిజమైన ‍ప్రశాంతతను వెతుక్కుంటూ కాశీకి వచ్చిన ఒక రష్యన్ మహిళ సనాతన ధర్మాన్ని స్వీకరించి, ఇంగా నుండి ఇంగానందమయిగా మారారు. 

వారణాసిలోని శివలా ఘాట్ సమీపంలోని వాగ్యోగ పీఠం వద్ద ఇంగానందమయి ఈ దీక్ష తీసుకున్నారు. ఇంగా రష్యాలోని మాస్కో నివాసి. ఈ దీక్షకు ముందు ఆమె భారతీయుల తరహాలో వస్త్రధారణ చేశారు. పూజలో కూర్చొని, సనాతన ధర్మ ప్రక్రియను అనుసరించి, హిందూ మతాన్ని స్వీకరించారు. పండితులు ఆశాపతి త్రిపాఠి నుండి ఇంగా దీక్షను స్వీకరించారు. 

అనంతరం ఆమె మహాశివునికి రుద్రాభిషేకం చేశారు. పండితులు ఆశాపతి త్రిపాఠి తనకు జీవితంలో ప్రశాంతతను అందించారని ఇంగా తెలిపారు. తాను ఇప్పటికే తాంత్రిక దీక్షను స్వీకరించానని, అయితే తనలోని అశాంతిని తొలగించుకునేందుకు సనాతన ధర్మాన్ని స్వీకరించినట్లు ఇంగా తెలిపారు. శివునికి రుద్రాభిషేకం చేస్తున్నప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం శాంతించాలని ప్రార్థించానని ఇంగా పేర్కొన్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)