Breaking News

కేరళలో రష్యా ఎన్నికల పోలింగ్‌!!

Published on Fri, 03/15/2024 - 10:03

తిరువనంతపురం: రష్యా ఎన్నికలు శుక్రవారం(మార్చ్‌ 15) ఉదయం ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఎన్నికల పోలింగ్‌ భారత్‌లోని కేరళ రాజధాని తిరువనంతపురంలో కూడా జరుగుతుండడం విశేషం. కేరళలో నివసిస్తున్న రష్యా పౌరులు తిరువనంతపురంలోని రష్యా కాన్సులేట్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

ఈ తరహాలో ఇక్కడ నివసిస్తున్న రష్యన్ల కోసం పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయడం ఇది మూడోసారని రష్యా కాన్సులేట్‌ డైరెక్టర్‌ రతీష్‌ నాయర్‌ తెలిపారు. పోలింగ్‌ విషయంలో తమకు సహకరిస్తున్న  రష్యన్లకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. టూరిస్టులుగా లేదా నివాసం ఉండేందుకు భారత్‌ వచ్చిన రష్యన్లకు దేశ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకు అవకాశం కల్పించడం సంతోషంగా ఉందని రష్యా పౌరురాలు ఉలియా తెలిపారు.

రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ మార్చ్‌ 17వరకు మూడు రోజుల పాటు జరగనుంది. ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్‌తో పోటీపడేందుకు ముగ్గురు అభ్యర్థులకు రష్యా సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషన్‌(సీఈసీ)అనుమతిచ్చింది. ఈ ముగ్గురు ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధాన్ని సమర్ధించిన వారే కావడం గమనార్హం. ఈ ఎన్నికల్లో పుతిన్‌ గెలుపు దాదాపు ఖాయమేనన్న అంచనాలున్నాయి.  

ఇదీ చదవండి.. మొదలైన రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)