Breaking News

Mahakumbh: 1,100 కి.మీ పరుగు.. కుంభమేళాకు అగ్నివీర్‌

Published on Sat, 02/15/2025 - 09:08

ఉత్తరప్రదేశ్‌లోని ‍ప్రయాగ్‌రాజ్‌లో భారీ ఎత్తున జరుగుతున్న కుంభమేళాలో ఇప్పటివరకూ 50 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు చేశారు. కుంభమేళా నేపధ్యంలో పలు విషయాలు వైరల్‌గా  మారుతున్నాయి. ఇదేవిధంగా కొందరు రాత్రికిరాత్రే ఫేమస్‌ అవుతున్నారు. మరోవైపు సాహసం చేసి, కుంభమేళాకు తరలివస్తున్నవారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ఒకరే రూపేష్‌.

2024లో దేశరక్షణ విభాగంలో ‘అగ్నివీర్‌’గా ఎంపికైన రూపేష్‌ గత జనవరి 23న కుంభమేళాకు పరుగును ప్రారంభించాడు. సహరసా(బీహార్‌) నుంచి  ప్రారంభమైన అతని పరుగు ప్రయాణం యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు చేరుకునేందుకు 17 రోజులు పట్టింది. రోజుకు 10 గంటపాలు పరుగుపెడుతూ ఫిబ్రవరి 8  మధ్యాహ్నం 12 గంటలకు పవిత్ర త్రివేణీ సంగమానికి చేరుకున్నాడు. రూపేష్‌ ఈ సాహసోపేత పరుగులో పలు ఆటంకాలను ఎదుర్కొన్నాడు.

కుంభమేళా ప్రాంతానికి పరుగు చేపట్టిన రూపేష్‌ ఫిబ్రవరి ఒకటిన అనారోగ్యానికి గురయ్యాడు. ఇదేవిధంగా మార్గం మధ్యలో అతని ఫోను, పర్సును దొంగలు లాక్కెళ్లిపోయారు. ఈ సమయంలో స్థానికులు అతనికి సహాయం అందించారు. ఐదారు వేల రూపాయల వరకూ ఆర్థిక సహాయాన్ని కూడా అందించారు. రూపేష్‌ చేపట్టిన ఈ పరుగు యాత్ర ప్రారంభంలో స్నేహితులిద్దరు అతని వెంట వచ్చారు. అయితే భక్తియార్‌పూర్‌ చేరుకోగానే వారిద్దరూ పూర్తిగా అలసిపోవడంతో వెనుదిరిగారు. అటువంటి పరిస్థితిలోనూ రూపేష్‌ ధైర్యాన్ని కోల్పోక 1,100 కిలోమీటర్ల తన పరుగుయాత్రను పూర్తిచేశాడు.

రూపేష్‌ 2024లో ఇండియన్‌ ఆర్మీలో ‘అగ్నివీర్‌’గా ఎంపియ్యారు. ప్రస్తుతం డిగ్రీ చేస్తున్నాడు. మారథాన్‌లో భారత్‌ బంగారు పతకం తేవాలనేది రూపేష్‌ కల. ఈ సందర్భంగా రూపేష్‌ తండ్రి రామ్‌ప్రవేశ్‌ యాదవ్‌ మాట్లాడుతూ కుంభమేళాకు పరిగెడుతూ వెళ్లాలనుకున్న తన కుమారుని నిర్ణయాన్ని విని చాలామంది ఎగతాళి చేశారని, అయితే రూపేష్‌ ఇప్పుడు తన లక్ష్యాన్ని పూర్తి చేయడం ఆనందంగా ఉన్నదన్నారు. 

ఇది కూడా చదవండి: Mahakumbh: మహారికార్డు.. ఐదు కోట్లు దాటిన పవిత్ర స్నానాలు

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)