Breaking News

TN Rupee Symbol Row: అవమానంగా ఫీలవుతున్నారా?

Published on Fri, 03/14/2025 - 10:20

చెన్నై: తమిళనాట రూపాయి చిహ్నం మార్పు రగడపై.. ప్రొఫెసర్‌ ఉదయ్‌ కుమార్‌ ఎట్టకేలకు స్పందించారు. రాష్ట్ర బడ్జెట్‌ ప్రతుల్లో ఈయన రూపొందించిన రూపాయి గుర్తును తొలగించి.. ఆ స్థానంలో రూ. అనే అర్థం వచ్చేలా తమిళ పదం డీఎంకే ప్రభుత్వం చేర్చిన సంగతి తెలిసిందే.  భాషా యుద్ధానికి మరింత ఆజ్యం పోస్తూ బీజేపీ వర్సెస్‌ కేంద్రంగా పరస్పర విమర్శలతో సాగుతోందీ వ్యవహారం. అయితే ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తానేం తప్పుబట్టబోనని ఉదయ్‌ కుమార్‌ అంటున్నారు.

మేం రూపొందించే అన్ని డిజైన్‌లకు పేరొస్తుందన్న గ్యారెంటీ లేదు. అలాగే.. అందరు వాటిని మెచ్చుకోవాలనీ లేదు. ప్రతీ ఒక్కరూ తమ పనిలో విమర్శలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ఆ విమర్శలను సానుకూలంగా తీసుకుని.. ఏదో ఒకటి నేర్చుకుంటూ ముందుకు సాగాలి. నాది అదే ధోరణి. అంతమాత్రాన ఇదేదో నన్ను, నా పనిని అవమానించడం అని నేను అనుకోను. రూపాయి సింబల్‌ను రూపొందించడాన్ని గర్వంగా భావిస్తున్నానన్న ఆయన.. డీఎంకే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తానేం వ్యతిరేకించబోనని స్పష్టం చేశారు. చిహ్నం మార్పునకు ప్రభుత్వానికి కారణాలు ఏవైనా ఉండొచ్చు.. అవేం నన్ను అసంతృప్తికి గురి చేయలేదు ఆయన వ్యాఖ్యానించారు.

నాడు నేను నాకు అప్పగించిన పని గురించి మాత్రమే ఆలోచించా.  సాధారణంగా.. అర్థవంతంగా ఉండే ఒక చిహ్నం రూపొందించాలని ఒకింత ఆందోళనగానే పని చేశా. ఆ చాలెంజ్‌లో విజయం సాధించా. అంతేకానీ, వివాదంగా మారాలని.. మారుతుందనిగానీ అనుకోలేదు అని ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారాయన.  

ఇదిలా ఉంటే.. 2009లో అప్పటి కేంద్ర ఆర్థికశాఖ మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ రూపాయికి ఓ గుర్తును సూచించాలని బహిరంగంగా పోటీ ప్రకటించారు. దేశవ్యాప్తంగా 3,331 డిజైన్లలో ఐదు షార్ట్‌ లిస్ట్‌ చేశారు. అందులో ప్రొఫెసర్‌ ఉదయ్‌ పంపిన గుర్తు ఫైనలైజ్‌ అయ్యింది. ఇది దేవనాగరి లిపి र, 'ra', లాటిన్‌లో ఇంగ్లీష్‌లో నిలువు గీత లేని Rను పోలి ఉంటుంది. ₹లో రెండు సమాన అడ్డగీతలు అసమానతల్లేని సంపద పంపిణీని సూచిస్తాయి. అయితే.. 

ఓ తమిళ వ్యక్తి రూపొందించిన గుర్తునే మార్చేసి.. డీఎంకే ప్రభుత్వం దారుణంగా అవమానపరిచిందంటూ బీజేపీ మండిపడుతోంది. ఈ విమర్శల వేళ దాని రూపకర్తే ఆ చర్యను తేలికగా తీసుకోవడం గమనార్హం.

ఇదీ చదవండి: రూపాయి సింబల్‌ సృష్టికర్త మామూలోడు కాదండోయ్‌!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)