Breaking News

దేవుడు, విశ్వరూపి... ఆ తర్వాతేమిటి?

Published on Fri, 07/19/2024 - 06:09

గుమ్లా (జార్ఖండ్‌): లోక్‌సభ ఎన్నికల అనంతరం బీజేపీపై తరచూ సునిశిత విమర్శలు గుప్పిస్తున్న ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘జీవుడు వికాస క్రమంలో మనిషి లక్షణాలు సంతరించుకుంటాడు. ఆనక అతీత శక్తులున్న సూపర్‌మ్యాన్‌ కావాలని ఆశపడతాడు. తర్వాత దేవుడు, భగవంతుడు కావాలనుకుంటాడు. ఆ తర్వాత విశ్వరూపి కావాలని ఆశిస్తాడు. దాన్నీ దాటితే? ఆపైన ఏముందో ఎవరికీ తెలియదు. అంతర్గత, బహిర్గత వికాసానికి అంతన్నదే ఉండదు’’ అన్నారు. మానవాళి శ్రేయస్సుకు, ప్రపంచాన్ని అందమైన నివాసయోగ్య ప్రదేశంగా తీర్చిదిద్దేందుకు పాటుపడటమే మన బాధ్యతన్నారు.

మోదీపై ఆరెస్సెస్‌ అగ్ని క్షిపణి: కాంగ్రెస్‌ 
మోహన్‌ భగవత్‌ వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించినవేనని కాంగ్రెస్‌ పేర్కొంది. ‘‘అవి లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌ (ఢిల్లీలోని మోదీ అధికారిక నివాసం)పైకి నాగ్‌పూర్‌ (ఆరెస్సెస్‌ ప్రధాన కార్యాలయం) ప్రయోగించిన అగ్ని క్షిపణి’ అంఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. అందరిలా తాను తల్లి కడుపు నుంచి పుట్టలేదని చెప్పుకున్న ప్రధానికి ఆరెస్సెస్‌ తాజా సందేశం విన్పించే ఉంటుందంటూ వాగ్బాణాలు విసిరారు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)