Breaking News

ఎనిమిదో తరగతి చదివినా, రూ. 70 వేలు కడితే డాక్టర్‌ కావొచ్చు..

Published on Fri, 12/06/2024 - 11:25

దేశంలో ఎక్కువ డిమాండ్‌ ఉన్న కోర్సుల్లో మెడిసిన్‌ ఒకటి. డాక్టర్‌ కావాలంటే ఎంతో శ్రమించాలి. చదువు పూర్తయ్యే వరకు లక్షలు లక్షలు ఖర్చుపెట్టడమే కాకుండా.. రాత్రి పగలు శ్రమించి చదవాలి.. అయినా వైద్యులు అవుతారనే నమ్మకం లేదు. కానీ కొంతమంది కష్టపడి చదవడం మానేసి అడ్డదారిలో డబ్బులు గుమ్మరించి డాక్టర్‌ పట్టా పొందాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఎక్కడైనా ఎనిమిదో తరగతి చదివినా డాక్టర్‌ కావచ్చని తెలుసా; లేదా కేవలం రూ.70వేలు కట్టినా వైద్యవిద్యకు సంబంధించిన సర్టిఫికెట్లు పొందవచ్చని విన్నారా?

వినడానికి నమ్మశక్యంగా లేని ఈ విషయాలు నిజంగా జరిగాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు ఇలా  తప్పుడు  ధ్రువపత్రాలు సంపాదించి డాక్టర్లుగా చలామణి అవుతున్న 14 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. గుజరాత్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. సూరత్‌లో 1,200 నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు  కలిగి ఉన్న ముఠా గుట్టు రట్టు చేశారు. 

ముగ్గురు వ్యక్తులు నకిలీ ధ్రువపత్రాలతో అల్లోపతి వైద్యం చేస్తున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి సదరు క్లినిక్‌లపై దాడి చేశారు. వారిని ప్రశ్నించగా, బోర్డు ఆఫ్‌ ఎలక్ట్రో హోమియోపతిక్‌ మెడిసిన్‌ గుజరాత్‌ పేరిట ఉన్న ధ్రువపత్రాలను చూపించారు. దీంతో అవి నకిలీ సర్టిఫికెట్లుగా పోలీసులు తేల్చారు. అలాంటి పత్రాలను గుజరాత్‌ ప్రభుత్వం జారీ చేయడంలేదని పేర్కొన్నారు. 

అయితే ఈ ముఠా 8వ తరగతి చదివిన వారి వద్ద ఒక్కొక్కరి నుంచి 70,000 వసూలు చేస్తూ నకిలీ వైద్య ధ్రువపత్రాలను అందించినట్లు తేలింది.  ఈ ముఠా నుంచి డిగ్రీలు కొనుగోలు చేసిన 14 మంది నకిలీ వైద్యులను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ వైద్య ధ్రువపత్రాలను అమ్ముతున్న ముఠా కీలక సభ్యుడు డాక్టర్‌ రమేశ్‌ గుజరాతీని కూడా అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి  వందలాది దరఖాస్తులు, సర్టిఫికెట్లు, స్టాంపులుస్వాధీనం చేసుకున్నట్లు పేర్కొ న్నారు.

అంతేకాకుండా అలా ఇచ్చే డిగ్రీలను ఏటా రెన్యూవల్‌ చేసుకోవాలి. అందుకోసం అదనంగా రూ. 5000 నుంచి రూ.15,000 వసూలు చేసేవారు. ఒకవేళ రెన్యూవల్‌ చేసుకోకుంటే సదరు ముఠా సభ్యులు బెదిరింపులకు దిగేవారు. ఇక సూరత్‌లో ఇటీవల కొందరు నకిలీ వైద్యులు భారీ స్థాయిలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి తెరిచి అధికారులకు దొరికిపోయిన సంగతి తెలిసిందే.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)