Breaking News

10th class: పదోతరగతి పరీక్షలు.. పాసయ్యేందుకు లంచంతో విద్యార్థుల ఎత్తుగడ!

Published on Sun, 04/20/2025 - 07:49

బెంగళూరు: ‘పాస్‌ అయ్యేందుకు లంచమా?!’ ఇటీవల పదో తరగతి పరీక్షలు రాసిన పలువురు విద్యార్థులు ఆన్సర్‌ షీట్లలో నోట్లు పెట్టి, పాస్‌ చేయమంటూ ఇన్విజిలేటర్లను అభ్యర్థించిన సంఘటన కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం పదండి

కర్ణాటక రాష్ట్రం (Karnataka) బెల్గావి జిల్లా చిక్కోడిటౌన్‌లో పదోతరగతి పబ్లిక్‌ ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. పదో తరగతి పరీక్షల పేపర్ల మూల్యాంకనం చివరి అంకానికి చేరుకుంది. అయితే ఈ పదోతరగతి పరీక్షాపేపర్ల మూల్యాంకనం సమయంలో పలువురు ఇన్విజిలేటర్లకు ఆన్సర్‌ షీట్లలో కరెన్సీ నోట్లు తారసపడ్డాయి. దీంతో కంగుతిన్న  ఇన్విజిలేటర్లు ఆన్సర్‌ షీట్లలో ఈ కరెన్సీ నోట్లు ఎందుకు వచ్చాయా? అని ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

‘సార్‌.. సార్‌ నన్ను పాస్‌ చేయండి. మీ దణ్ణం పెడతా. నా ప్రేమ మీ చేతుల్లోనే ఉంది. సార్‌ ఇవిగో రూ.500 ఛాయ్‌ తాగండి.. నన్ను పాస్‌ చేయండి. నన్ను పాస్‌ చేయించలేదనుకో అంటూ ఇలా విద్యార్థులు ఎగ్జామ్స్‌ ఆన్సర్‌ షీట్ల మీద పలువురు విద్యార్థులు ప్రాధేయపడుతూ రాశారు. వారిలో ఓ పదో తరగతి విద్యార్థి తన ఆన్సర్‌ షీట్‌ మీద రూ.500 నోటు పెట్టి పాస్‌ చేయమని అభ్యర్థించిన ఓ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ రిక్వెస్ట్‌ చూసిన ఓ ఇన్విజిలేటర్‌ ‘మీ దుంప తెగ.. ఇలా తయారేంట్రా మీరు’ అంటూ ఆ ఫొటోని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. 

ఓ విద్యార్థి రూ.500 నోటు ఇస్తే మరికొందరు విద్యార్థులు తమకు పలు రిక్వెస్టులు చేసినట్లు చీక్కోడి టౌన్‌లో పదో తరగతి పరీక్షా పేపర్లను మూల్యాంకనం చేస్తున్న ఇన్విజిలేటర్లు చెబుతున్నారు. వాటిల్లో విద్యార్థులు అభ్యర్థనలు ఇలా ఉన్నాయి. 

  •  ప్లీజ్‌ పాస్‌ చేయండి సార్‌. నా ప్రేమ మీ చేతుల్లో ఉంది.

  • నేను పాసాయితే నా ప్రేమను కొనసాగిస్తా

  • సార్‌ ఇదిగో రూ.500 .. ఛాయ్‌ తాగి నన్ను పాస్‌ చేయండి

  • మీరు నన్ను పాస్‌ చేయిస్తే .. నేను మీకు డబ్బులిస్తా

  • నేను పాస్‌ కాకపోతే మా తల్లిదండ్రులు నన్ను కాలేజీకి పంపరూ అని ఆన్సర్‌ షీట్లో రాశారు.

  • చివరికి పలువురు ఇన్విజిలేటర్లు ఆ ఆన్సర్‌ షీట్లలోని కరెన్సీ నోట్లను ఉన్నతాధికారులకు అందించారు. విద్యార్థులు రాసిన ఆన్సర్ల ఆధారంగా మార్కులు వేశారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)